తెలంగాణలో నేరాలు పెరిగినయ్ : డీజీపీ రవి గుప్తా

తెలంగాణలో నేరాలు పెరిగినయ్  : డీజీపీ రవి గుప్తా

తెలంగాణలో గతేడాదితో పోలిస్తే   8.97 శాతం నేరాలు పెరిగాయని డీజీపీ రవి గుప్తా తెలిపారు.  ఈ మేరకు  రాష్ట్ర వార్షిక నేర నివేదికను ఆయన రిలీజ్ చేశారు.  18 శాతం సైబర్ క్రైమ్ కేసులు పెరగాయన్నారు.  సైబర్ క్రైమ్స్ ద్వారా 7వందల కోట్లు దోపిడీ జరిగిందని తెలిపారు.  ఇందులో 7 కోట్లు రికవరీ చేయగా సైబర్ నేరగాళ్ల బ్యాంక్ అకౌంట్స్ లో 133 కోట్ల రూపాయలు ఫ్రీజ్ చేశామని తెలిపారు.  రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు ఒక శాతం తగ్గాయన్న డీజీపీ ..  కోర్టు శిక్షలు 41 శాతం పెరిగాయని పేర్కొన్నారు.  175 మంది నేరగాళ్లపై పీడీ చట్టం ప్రయోగించినట్లు వెల్లడించారు. 

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11 లక్షల 10 వేల సీసీ కెమెరాలున్నాయని చెప్పారు రవిగుప్తా.. .. ఇందులో ఈ ఏడాది ఒక లక్ష 145 కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.  డయల్ 100కి 16 లక్షల 09 వేల 619 కాల్స్ వచ్చాయని  చెప్పారు.   ఈ ఏడాదిలో1108 జీరో FIR కేసులు నమోదు కాగా   789 హత్యకేసులు,  2,284 రేప్ కేసులు, 1,362 కిడ్నాప్ కేసులు నమోదయ్యాయి.  TSLPRB  ద్వారా ఈ ఏడాది 587 ఎస్సైలు , 15 వేల 750 కానిస్టేబుల్స్ ని రిక్రూట్ చేశామని చెప్పుకొచ్చారు.