ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. వరుసగా సెలవులు రావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.ఆలయ పరిసరాలతో పాటు కల్యాణకట్ట, పుష్కరిణి, బస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బే, దర్శన, ప్రసాద క్యూలైన్లు భక్తులతో సందడిగా కనిపించాయి. రద్దీ ఎక్కువగా ఉండడంతో ధర్మదర్శనానికి 4 గంటలు, స్పెషల్ దర్శనానికి గంటన్నర సమయం పట్టిందని భక్తులు తెలిపారు. 

బస్సులు లేకపోవడంతో ధర్నాకు దిగిన భక్తులు

రద్దీకి అనుగుణంగా కొండపైకి ఆర్టీసీ బస్సులు నడపకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రెండు గంటలకు పైగా వెయిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసినా ఒక్క బస్సు కూడా రాకపోవడంతో ధర్నాకు దిగారు. ధర్నా విరమించాలని పోలీసులు కోరడంతో ఇద్దరి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. విషయం తెలుసుకున్న ఆలయ ఆఫీసర్లు ఆర్టీసీ డీఎంతో మాట్లాడి బస్సుల సంఖ్య పెంచడంతో భక్తులు ఆందోళన విరమించారు. 

మునుగోడులో రాజగోపాల్‌రెడ్డి క్యాంప్‌ ఆఫీస్‌

మునుగోడు, వెలుగు: నల్గొండ జిల్లా మునుగోడులో మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి క్యాంప్‌ ఆఫీస్‌ను ఓపెన్‌ చేశారు. ఆదివారం రాజగోపాల్‌రెడ్డి, ఆయన భార్య లక్ష్మితో కలిసి ఆఫీస్‌లో హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలిచిన టైంలోనే క్యాంప్‌ ఆఫీస్‌ ఏర్పాటు చేయాలని అనుకున్నా కరోనా వల్ల సాధ్యం కాలేదన్నారు. కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్‌ వెంకటస్వామి, నాయకులు గంగిడి మనోహర్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఈటెల రాజేందర్, సంకినేని వెంకటేశ్వరావు, బండారు ప్రసాద్, కంకణాల శ్రీధర్‌రెడ్డి, కుంభం శ్రీనివాస్‌రెడ్డి, గార్లపాటి జితేందత్‌ హాజరయ్యారు. అనంతరం చండూరు మండలానికి చెందిన పలువురు బీజేపీలో చేరారు. 

ప్రజల కష్టాలు కనిపించడం లేదా ?

యాదగిరిగుట్ట, వెలుగు : గ్రామాలను బెల్టుషాపులమయంగా మార్చారని ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆరోపించారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మహాత్మాగాంధీ గ్రామస్వరాజ్యం కోసం పోరాడితే, కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెల్టుషాపులకు పర్మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇస్తూ అంధకారంలోకి నెట్టేస్తున్నారన్నారు. గాంధీ ఆశయాలను విరుద్ధంగా వ్యవహరిస్తున్న కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు జాతిపిత అని పిలిపించుకునే అర్హత లేదన్నారు. గ్రామాల్లో కనీస వసతులు లేక ప్రజలు పడుతున్న కష్టాలు కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను తన అసమర్థ పాలనతో లిక్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆదాయంపై ఆధారపడే స్థాయికి తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పతనం తప్పదని, కేంద్రంతో పాటు రాష్ట్రంలోనూ బీజేపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 
కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు భువనగిరి శ్యాంసుందర్, ప్రధాన కార్యదర్శి బెలిదె అశోక్, జిల్లా నాయకులు కోల వెంకటేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, తంగళ్లపల్లి సుగుణాకర్,  నాయకులు రాజు, తాళ్ల భాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, బాపురెడ్డి, బాలరాజు   పాల్గొన్నారు.

నామవరంలో జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు

మునగాల (మోతె), వెలుగు: సూర్యాపేట జిల్లా మోతె మండలం నామవరంలో శ్రీరామయూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి కబడ్డీ పోటీలను ఆదివారం టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కన్మంతరెడ్డి శశిధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసికోల్లాసానికి ఉపయోగపడుతాయన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పుల్లారావు, ఎంపీపీ శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, కన్మంతరెడ్డి కృష్ణారెడ్డి, సర్పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తండు యాదమ్మ మన్సూర్, ఎంపీటీసీ దైవ పున్నమ్మ మైసయ్య, కరక్కాయలగూడెం సర్పంచ్ నూకల యుగంధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, రేణుక రామయ్య పాల్గొన్నారు.

కొనసాగుతున్న సాగర్​ నీటి విడుదల

హాలియా, వెలుగు : శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లో కొనసాగుతోంది. ఎగువ నుంచి 88,440 క్యూసెక్కుల వరద వస్తుండడంతో సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 6 గేట్లను 5 ఫీట్ల మేర 48,540 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ నుంచి కుడికాల్వకు 5,088 క్యూసెక్కులు, ఎడమకాల్వకు 3,667, వరదకాల్వకు 400 క్యూసెక్కులు, మెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హౌజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 28,745 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

మున్నూరుకాపు కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటుకు కృషి

సూర్యాపేట, వెలుగు : మున్నూరుకాపు కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు. ఆదివారం సూర్యాపేటలో మున్నూరుకాపు మహాసభ జిల్లా ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించారు. అనంతరం స్టూడెంట్లకు నోట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్నూరుకాపుల ఐక్యత కోసం మూడున్నరేండ్లుగా పోరాటం చేస్తున్నామన్నారు. పదవుల కోసం కాకుండా, కుల అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలని సూచించారు.

కాచిగూడ ట్రస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందన్నారు. త్వరలో జిల్లా, మండల స్థాయి సమావేశాలను ఏర్పాటు చేసి ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ప్రారంభించాలని సూచించారు. కార్యక్రమంలో మున్నూరుకాపు మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మణికొండ వెంకటేశ్వరరావు, కార్యదర్శి వినోద్, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు ఎలిమినేటి రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు పారా నాగేశ్వరరావు, పెద్దిరెడ్డి రాజా, గణేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంపీపీ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాయుడు. కౌన్సిలర్ అభినయ్, మిర్యాల కృష్ణమూర్తి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల చంద్రశేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

దైవ చింతనతో మానసిక ప్రశాంతత 

యాదగిరిగుట్ట/నల్గొండ అర్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/కోదాడ, వెలుగు : దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేతి విద్యాసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా యాదగిరిగుట్టలోని శారదాదేవి ఆలయంలో ఆదివారం నిర్వహించిన ‘చండీహోమం’లో విద్యాసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట మున్నూరు కాపు సంఘం నాయకులు గంగసాని నవీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పలుగుల శ్రీనివాస్, గంగసాని హనుమంతరావు, పుప్పాల నర్సింహ పాల్గొన్నారు.

అలాగే నల్గొండలోని రాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలనీలో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహం వద్ద ఎమ్మెల్యే భూపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మందడి సైదిరెడ్డి, గణేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నేతి రఘుపతి, బకరం వెంకన్న, పట్టణ కార్యదర్శి బోనగిరి దేవేందర్ పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరించిన అనంతరం అన్నదానం చేశారు.

ఖైదీలు తమ ప్రవర్తన మార్చుకోవాలి

హుజూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : సహనం లేకపోవడం వల్లే చాలా మంది నేరాలకు పాల్పడి జైళ్ల పాలవుతున్నారని హుజూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జూనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సివిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జడ్జి వి. సాకేత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిత్ర చెప్పారు. ఖైదీల సంక్షేమ దినోత్సవం సందర్భంగా ఆదివారం హుజూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జైలులో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఖైదీల సంక్షేమానికి జైళ్ల శాఖ చర్యలు తీసుకోవడం అభినందనీయం అన్నారు. ఖైదీలు తమ ప్రవర్తన మార్చుకొని సమాజంలో గౌరవప్రదంగా బతకాలని సూచించారు. అనంతరం  ఖైదీలకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూపరింటెండెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మంగ్తానాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సీఐ రామలింగారెడ్డి, ఎస్సై వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, లాయర్లు కాల్వ శ్రీనివాసరావు, ఎంఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.రాఘవరావు, కొట్టు సురేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

గట్టుప్పల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

చండూరు, వెలుగు : నల్గొండ జిల్లా గట్టుప్పల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మండల కేంద్రంగా మార్చడంతో ఆదివారం వివిధ ప్రభుత్వ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి జగదీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి హాజరై తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించారు. తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పి. సైదులు, ఎస్సైగా సురేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చార్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకున్నారు. అనంతరం కృతజ్ఞతా సభా స్థలం వరకు రోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షో నిర్వహించగా, మహిళలు బోనాలతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వినయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కృష్ణారెడ్డి, ఎస్పీ రెమా రాజేశ్వరి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, జడ్పీ వైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నారాయణగౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు దంటు జగదీశ్వర్, గుర్రం మాధవి వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు. 

దళితులను మోసం చేస్తున్న టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

మునుగోడు, వెలుగు : టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం దళితులను మోసం చేస్తూ, అణగదొక్కే ప్రయత్నం చేస్తోందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మునుగోడు స్టీరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి విమర్శించారు. నల్గొండ జిల్లా మునుగోడులో ఆదివారం ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు గోలి ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధ్యక్షతన జరిగిన ముఖ్య నాయకుల మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వారు మాట్లాడారు.

దళితుడిని సీఎం చేస్తానని చెప్పి మాట తప్పిన కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రజలు నమ్మడం లేదన్నారు. దళితబంధు పేరిట మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని విమర్శించారు. సమావేశంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పుల భాష, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మునుగోడు ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి గంగిడి మనోహర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి పోతెపాక సాంబయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాస శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు గ్యార గోపాల్, గాదరి జంగయ్య, ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బాకీ నర్సింహ, కార్యదర్శి ఇరిగి ఆంజనేయులు, ఎస్సీమోర్చా కోశాధికారి నాగిళ్ల సైదులు తదితరులు 
 పాల్గొన్నారు.

ఎమ్మెల్యేపై హైకమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఫిర్యాదు చేస్తాం

కోదాడ, వెలుగు : సూర్యాపేట జిల్లా కోదాడ ఎమ్మెల్యే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ఎమ్మెల్యేపై హైకమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఫిర్యాదు చేస్తామని మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, నియోజకవర్గ మాజీ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి శశిధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు. ఎమ్మెల్యే మహిళా ప్రజాప్రతినిధులను అవమానిస్తున్నారని ఆరోపించారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలులో ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే వైఖరి వల్ల నియోజకవర్గంలో పార్టీకి నష్టం జరుగుతోందన్నారు. అధికారిక కార్యక్రమల్లో కనీసం ప్రొటోకాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాటించడం లేదని, సొంత పార్టీ లీడర్లపైనే కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు ముత్తవరపు పాండురంగారావు, వనపర్తి లక్ష్మీనారాయణ, జలగం సుధీర్, వట్టికోటి నాగయ్య, బండ్ల కోటయ్య బొలిశెట్టి నాగేంద్రబాబు  తదతరులు 
పాల్గొన్నారు.

గాంధీకి ఘన నివాళి

వెలుగు నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ : మహాత్మాగాంధీ జయంతిని ఆదివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు, వివిధ పార్టీలు, సంఘాల ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం, ఫొటోకు పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీ సేవలు మరువలేనివని కొనియాడారు.
భువనగిరిలో ప్రొటోకాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లొల్లి గాంధీ జయంతి సందర్భంగా భువనగిరి టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రొటోకాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వివాదం తలెత్తింది.

ఎంపీడీవో ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విగ్రహావిష్కరణకు సంబంధించి తనకు ఆహ్వానం అందలేదంటూ జడ్పీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎలిమినేటి సందీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి కార్యక్రమానికి హాజరుకాలేదు. దీంతో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అలాగే ఎంపీపీ నరాల నిర్మల, ఎంపీటీసీ కంచె లలిత, ఆమె భర్త మల్లయ్య మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. ‘పైసలున్న ఎంపీటీసీలనే గౌరవిస్తరా ? కనీసం కొబ్బరికాయ కూడా కొట్టనివ్వరా ?  అంటూ వారు అలక వహించారు. దీంతో అక్కడే ఉన్న ఎమ్మెల్యే శేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి వారిని వారించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కూడా ప్రొటోకాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విషయంపై చర్చ జరిగినట్లు సమాచారం.

పాడి రైతుల అభివృద్ధికి కృషి

రాజాపేట, వెలుగు : పాడి రైతుల అభివృద్ధికి కృషి చేస్తానని నార్ముల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లింగాల శ్రీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు. యాదాద్రి జిల్లా రాజాపేట లోని మిల్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చిల్లింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆదివారం పాడి రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాల బిల్లుల చెల్లింపులలో ఆలస్యం జరగకుండా చూస్తానన్నారు. డెయిరీని లాభాల బాటలో నడిపించేందుకు కృషి చేస్తానన్నారు. అనంతరం నూతన పాలకవర్గాన్ని రైతులు సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలమణి, మదర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెయిరీ డైరెక్టర్లు చింతలపురి వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాంరెడ్డి, గొల్లపల్లి రాంరెడ్డి, సొసైటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాగరాజు, మేనేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రవీందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కుమారస్వామి పాల్గొన్నారు.

కుల రహిత సమాజ స్థాపనే లక్ష్యం

సూర్యాపేట, వెలుగు : కుల వివక్ష, అంటరానితన నిర్మూలన కోసం పోరాటం చేస్తామని కేవీపీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా కార్యదర్శి కోట గోపి చెప్పారు. కేవీపీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. దళితుల సమస్యల పరిష్కారం కోసం కేవీపీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తున్నట్లు చెప్పారు. తమకు దళితులంతా అండగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో ఎలుగురి గోవింద్, వేల్పుల వెంకన్న, వీరబోయిన రవి, కృష్ణ పాల్గొన్నారు.

నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

మునగాల, వెలుగు : వరదల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని నల్గొండ ఎంపీ ఉత్తమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి కోరారు. సూర్యాపేట జిల్లా మునగాల – గణపవరం మధ్యలో దెబ్బతిన్న బ్రిడ్జిని ఆదివారం పరిశీలించారు. ప్రభుత్వ విధానాలతో ప్రజలు, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. దెబ్బ తిన్న బ్రిడ్జిలకు రిపేర్లు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. బ్రిడ్జి నిర్మాణానికి ప్రపోజల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంపాలని ఆదేశించారు. అనంతరం మత్స్యకారులతో మాట్లాడారు. 

ప్రజా ఉద్యమాలను బలపర్చాలి

మిర్యాలగూడ, వెలుగు: కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న వ్యతిరేక విధానాలపై సీపీఎం చేపట్టే ఉద్యమాలకు మద్దతు ఇవ్వాలని ఆ పార్టీ రాష్ట్రకార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కోరారు. నల్గొండ జిల్లా మిర్యాలగూలోని పార్టీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆదివారం నిర్వహించిన జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాడీ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆయన మాట్లాడారు. నిరుద్యోగ సమస్య, ధరల నియంత్రణలో కేంద్రం విఫలమైందన్నారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, రాష్ర్ట కమిటీ సభ్యుడు డబ్బికార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మల్లేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జిల్లా కమిటీ సభ్యులు వెంకటేశ్వర్లు, రవినాయక్, మల్లు గౌతంరెడ్డి, పాండు, రెముడాల పరుశరాములు పాల్గొన్నారు.