కొనసాగుతున్న భరోసా అవగాహన

కొనసాగుతున్న భరోసా అవగాహన

గచ్చిబౌలి, వెలుగు: సైబరాబాద్ గచ్చిబౌలి భరోసా టీమ్ గురువారం గచ్చిబౌలి విలేజ్, లింగంపల్లిలోని స్ప్రెడ్ హోమ్స్, తారానగర్ అంగన్వాడీ కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించింది. బాలలపై వేధింపులు, చిన్నారుల అక్రమ రవాణా, లైంగిక దాడులు, పోక్సో చట్టం, సైబర్ నేరాలు, గృహ హింస ఇతర అంశాల గురించి వివరించి చెప్పారు.

గచ్చిబౌలిలో పిల్లలకు గుడ్​టచ్, బ్యాడ్​టచ్​గురించి..పెద్దలకు తెలియకుండా గేమ్స్​డౌన్​లోడ్​ చేస్తే వచ్చే నష్టాల గురించి వివరించారు. మహిళలకు ఉన్న చట్టపరమైన రక్షణల గురించి చెప్పారు.