- న్యూఇయర్ వేళ సైబరాబాద్ పోలీసుల ఆంక్షలు
- వాహనదారులు డాక్యుమెంట్స్వెంటే ఉంచుకోవాలి
- వయలేషన్స్ గుర్తించడానికి స్పెషల్ కెమెరాల ఏర్పాటు
గచ్చిబౌలి, వెలుగు : డిసెంబర్31న రాత్రి న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా సైబరాబాద్కమిషనరేట్పరిధిలో పలు ట్రాఫిక్ఆంక్షలు విధించడంతో పాటు పలు మార్గదర్శకాలను విడుదల చేశారు. పోలీసుల సూచనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రైడ్ క్యాన్సిల్ చేస్తే జరిమానా
క్యాబ్, టాక్సీ, ఆటో రిక్షా డ్రైవర్లు, ఆపరేటర్లు యూనిఫాం వేసుకుని ఉండాలని, రైడ్స్ సందర్భంగా అన్ని డాక్యుమెంట్లు క్యారీ చేయాలన్నారు. ఎవరైనా బుక్‌చేసిన రైడ్‌ను క్యాన్సిల్ చేయకూడదని, అలా చేస్తే..ఈ-చలాన్ రూపంలో ఫైన్ వేస్తామన్నారు. ఎవరైనా అలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నట్టయితే వాహన వివరాలు, సమయం, స్థలం వంటి వాటితో 9490617346 వాట్సాప్నంబర్కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. అధిక చార్జీలు డిమాండ్ చేసినా చర్యలు తప్పవన్నారు.
బార్లు, పబ్‌లు, క్లబ్‌లు ఇవి చేయాల్సిందే..
బార్, పబ్, క్లబ్ లకు వచ్చే కస్టమర్లు మద్యం మత్తులో వాహనం నడపకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సైబరాబాద్ పోలీసులు సూచించారు. లేకపోతే వారిపై చర్యలు తప్పవన్నారు. పార్టీ ముగిశాక ఎవరైనా మద్యం మత్తులో వాహనం నడుపుతున్నారని తెలిస్తే అడ్డుకోవాలన్నారు.
స్పెషల్ కెమెరాలు పట్టేస్తాయ్..
రాంగ్ సైడ్ డ్రైవింగ్, అనధికారిక పార్కింగ్, ఓవర్ స్పీడ్, సిగ్నల్ జంప్, ర్యాష్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడాన్ని గుర్తించడానికి స్పెషల్ కెమెరాలు ఇన్స్టాల్ చేశామని పోలీసులు తెలిపారు. సైబరాబాద్ పరిధిలోని అన్ని రోడ్లపై సాయంత్రం 8 గంటల నుంచి డ్రంక్ అండ్డ్రైవ్తనిఖీలు మొదలుపెడతామన్నారు. ఆ టైంలో వాహనాల డాక్యుమెంట్లు కూడా చూపించాలని లేకపోతే స్వాధీనం చేసుకుంటామన్నారు. మైనర్ డ్రైవింగ్ చేస్తూ దొరికినా చర్యలు తప్పవన్నారు., ఒకవేళ వాహనాలు స్వాధీనం చేసుకుంటే వారు వెళ్లేందుకు ఏర్పాట్లూ కూడా చూసుకోవాల్సి ఉంటుందన్నారు. వాహనాల్లో ఎక్కువ సౌండ్‌తో మ్యూజిక్ప్లే చేసినా జప్తు చేస్తామన్నారు. నంబర్ ప్లేట్లు ఉండాలని, ఓవర్ క్రౌడింగ్ ఉన్నా, వాహనాల పై కూర్చొని ప్రయాణించినా కేసులు బుక్చేస్తామన్నారు. నమోదు చేసే కేసులను బట్టి జరిమానా, లేదా జైలు శిక్ష విధించే అవకాశం
ఉంటుందన్నారు.
వేడుకల వేళ స్పెషల్ చెకింగ్డీసీపీ వైభవ్ గైక్వాడ్
బషీర్‌బాగ్, వెలుగు : కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో డ్రగ్స్నిరోధించేందుకు నగరవ్యాప్తంగా పబ్‌లు, క్లబ్‌లు, బార్లు, రెస్టారెంట్లలో ప్రత్యేక టీమ్స్‌తో ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్ననట్లు టాస్క్ ఫోర్స్, హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ తెలిపారు. ఈ నెల 27న ఏడు డెకాయ్ టీమ్స్, 28న 8 టీమ్స్‌తో చెకింగ్నిర్వహించినట్టు చెప్పారు. డిసెంబర్ 27న 40 మందిని చెక్‌చేయగా ఒక్కరు మాత్రమే గాంజా తీసకున్నట్టు వెల్లడైందన్నారు. 28న చేసిన 25ని పరీక్షించగా ఎవరికీ పాజిటివ్ రాలేదన్నారు.
