ఖర్జూరం గురించి అందరికీ తెలుసు. అవి తింటే రక్తం పెరుగుతుందని అంటారు. ఖర్జూరాలు చలికాలంలో తింటే కలిగే లాభాల గురించి పరిశోధన జరిగింది. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. . .!
ఖర్జూరాల గురించి పరిశోధకులు ఎన్నో కొత్త విషయాలు తెలిపారు. రోజుకు రెండు ఖర్జూ రాలు తింటే వేడిశాతం తగ్గకుండా ఉంటుంది. మనసు ఉత్సాహంగా ఉంటుంది. కండరాల్ని గట్టిగా. ఉంచడమే కాకుండా, శీతాకాలం లో వచ్చే జలుబు, దగ్గు లాంటి రోగాలను దగ్గరకు రానివ్వవు.శరీరంలో కొవ్వు శాతం పెరగ కుండా చేస్తాయి.
ఖర్జురాల్లో ఉండే క్యాల్షియం ఎముకలను గట్టిపడేలా చేస్తుంది. ఇంకా చలి కాలంలో శరీరంలోని ప్రొటీన్స్ ను బ్యాలెన్స్ చేస్తాయి.బి 1,బి 2, బి 3, బి 5 విటమిన్స్ పుష్కలంగా దొరుకుతాయి. కాబట్టి ఈ విటమిన్స్ తక్కువ ఉన్న వాళ్లు వీటిని తీసుకోవడం చాలా మంచిదని వైద్యులు సూచిస్తారు.
ఖర్జూరాలు ఉండే పొటాషియం, సోడియం నాడీవ్యవస్థ చక్కగా పని చేయడానికి ఉపయోగపడతాయి. వీటిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రక్తహీనత ఉన్న వాళ్లు వీటిని తీసుకుంటే రక్తం పెరుగుతుంది. ఖర్జూరాల్లో ఉండే విటమిన్ ..డి.. శరీరాన్ని ప్రకాశవంతంగా ఉంచుతుంది. వీటిలోని మినరల్స్ శరీరానికి ఎంతో అవసరం. కాబట్టి చలికాలంలో ఖర్జూరాలు తింటే ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్లేనని పరిశోధకులు చెబుతున్నారు. .
