కోరుట్ల, వెలుగు: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం తిమ్మయ్యపల్లి సర్పంచ్ గా తల్లి గంగవ్వపై కూతురు పల్లెపు సుమ గెలుపొందారు. తల్లి పై కూతురు 91 ఓట్ల తేడాతో విజయం సాధించారు. సర్పంచ్ గా ఎన్నికైన సుమ కొన్నాళ్ల కింద అదే గ్రామానికి చెందిన యువకుడిని ప్రేమ పెండ్లి చేసుకోగా ఇరుకుటుంబాల మధ్య విభేదాలు వచ్చాయి. కాగా.. సర్పంచ్ ఎన్నికల్లో తల్లి, కూతురు పోటీ పట్టారు.

