విషాదం : నీటి సంపులో పడి యువకుడి మృతి

విషాదం : నీటి సంపులో పడి యువకుడి మృతి

హైదరాబాద్  కొండాపూర్ లో విషాదం చోటుచేసుకుంది. నీటి సంపులో పడి ఓ యువకుడు చనిపోయాడు. అక్మల్ సుఫియాన్ అనే యువకుడు ఉదయం జిమ్ కు వెళ్లి తన రూముకు వెళ్లే క్రమంలో తెరిచి ఉన్న నీటి సంపులో పడిపోయాడు. అపార్ట్మెంట్ యాజమాని సీసీ కెమెరాల్లో  ప్రమాదాన్ని గుర్తించారు. సంపులో నుంచి యువకుడిని బయటకు తీశాడు. అయితే అప్పటికే అక్మల్ చనిపోయాడు. 

ఖమ్మం జిల్లా ఇల్లెందుకు చెందిన అక్మల్ ఓ ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తూ కొండాపూర్ లో అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. స్థానికులు ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డెడ్ బాడీని రికవరీ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడతామని పోలీసులు తెలిపారు.