ఐటీ నగరం హైదరాబాద్లో పాఠశాలలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్‌లపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐటీ జోన్‌లో స్కూల్స్ వదిలిపెట్టే టైమింగ్లో మార్పులకు పాఠశాలల యాజమాన్యానికి సూచనలు చేశారు. ఇటీవల ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ జి.సుధీర్ బాబు పాఠశాల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. పాఠశాల జోన్లో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా సమయపాలన పాటించాలని సమావేశంలో కోరారు.
ఐటీ జోన్ లో ఉన్న పాఠశాలల్లో లాగ్ అవుట్ సమయాన్ని 15 నిమిషాలు తగ్గించాలని పాఠశాలల యాజమాన్యాలను ట్రాఫిక్ పోలీసులు కోరారు. ట్రాఫిక్ రద్దీ, పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఆధారంగా సమయాలను ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ఈ సమావేశంలో పాఠశాలల ముందు ట్రాఫిక్ వాలంటీర్లు, సెక్యూరిటీ గార్డులను నియమించాలని పాఠశాల యాజమాన్యాలను కోరారు.
ఇటీవల భారీ వర్షాలతో హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీలు.. నగర పోలీసుల సలహా మేరకు, భారీ ట్రాఫిక్ జామ్‌లను నివారించడానికి దశల వారీగా ఉద్యోగులను లాగ్ అవుట్ ప్రకటించాయి.

