
బేసిగ్గా సౌతిండియనే అయినా నార్త్‌లో టాప్ హీరోయిన్ అయ్యింది దీపికా పదుకొనె. అయితే ఇన్నాళ్లకు ఆమె సౌత్‌లోనూ బిజీ అయ్యే చాన్సెస్ కనిపిస్తున్నాయి. ఆల్రెడీ ప్రభాస్, నాగ్ అశ్విన్‌ల సినిమాలో హీరోయిన్‌గా చేస్తోంది. ‘ప్రాజెక్ట్ కె’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాని ఇటీవలే స్టార్ట్ చేశారు. ఇప్పుడు మరో సౌత్ మూవీలో ఆమె నటించబోతున్నట్లు తెలుస్తోంది. అది కూడా సూపర్‌స్టార్ రజినీకాంత్‌తో. శివ డైరెక్షన్‌లో రజినీ నటించిన ‘అన్నాత్తే’ మూవీ దీపావళికి రిలీజ్ కాబోతోంది. దీని తర్వాత ఆయన దేశింగ్ పెరియస్వామి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కే ఈ మూవీలో హీరోయిన్‌గా దీపికను అడిగారట. ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయని, దీపిక కూడా ఈ ప్రాజెక్ట్ విషయంలో పాజిటివ్‌గానే ఉందని కోలీవుడ్ టాక్. నిజానికి రజినీతో చాలాకాలం క్రితమే ‘కొచ్చాడయాన్’లో నటించింది దీపిక. కానీ అది యానిమేషన్ ఫిల్మ్ కావడం, పైగా ఫెయిలవడంతో అభిమానులు డిజప్పాయింట్ అయ్యారు. అందుకే ఆమెను మరోసారి రజినీకి జోడీగా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం షారుఖ్‌తో కలిసి ‘పఠాన్’ షూట్‌లో పాల్గొంటోందామె. ఈ మూవీ కోసం ఎంతో కష్టమైన యాక్షన్ సీన్స్ చేస్తోంది. ఆల్రెడీ ఎక్స్‌ఎక్స్‌ఎక్స్: రిటర్న్ ఆఫ్ జేండర్ కేజ్’లో స్టంట్స్ చేసి మెప్పించింది. ఇప్పుడు ‘పఠాన్’ కోసం ట్రైనింగ్ తీసుకుని మరీ ఫైట్స్ చేస్తోంది. ఇక కపిల్ దేవ్ వైఫ్ పాత్రలో దీపిక నటించిన ‘83’ రిలీజ్‌కి రెడీగా ఉంది. సర్కస్, ఇన్‌టర్న్ రీమేక్‌తో పాటు శకున్ బాత్రా డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తోంది. ఇక ‘మహాభారతం’ చిత్రాన్ని నిర్మిస్తూ ద్రౌపదిగా నటించనుంది. ఇంత బిజీగా ఉండి కూడా సౌత్‌పై ఓ కన్నేసింది. ప్రతి సినిమాతోను, ప్రతి పాత్రతోను సూపర్ అనిపించుకునే ఆమె.. సూపర్ స్టార్‌తో నటించడానికి సై అంటుందో లేదో చూడాలి మరి.