హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద కారు ఢీకొని జింక మృతి

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద కారు ఢీకొని జింక మృతి

గచ్చిబౌలి, వెలుగు: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద కారు ఢీకొని జింక మృతి చెందింది. శనివారం ఉదయం పాత ముంబై హైవేపై అలిండ్ కంపెనీ ప్రహారీ గోడ వద్ద జింక తిరుగుతూ కనిపించింది. స్థానికులు, వాహనదారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇంతలోనే జింక ఒక్కసారిగా రోడ్డుపైకి రావడంతో అటూగా వెళ్తున్న కారు ఢీకొట్టింది. 

ఈ ప్రమాదంలో జింకకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, హెచ్‌సీయూ యానిమల్ ప్రొటెక్షన్ టీమ్, సిటిజన్స్ ఫర్ యానిమల్స్ ఎన్జీఓ ప్రతినిధులు సంఘటనా స్థలానికి చేరుకొని, గాయపడిన జింకను వన్యప్రాణి అంబులెన్స్​లో సంరక్షణ కేంద్రానికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జింక మృతి చెందింది.