రీల్ కోసం లైఫ్ రిస్క్..ఢిల్లీ విధుల్లో పెళ్లి కూతురు డ్రైవింగ్..షాకిచ్చిన పోలీసులు

రీల్ కోసం లైఫ్ రిస్క్..ఢిల్లీ విధుల్లో పెళ్లి కూతురు డ్రైవింగ్..షాకిచ్చిన పోలీసులు

ఢిల్లీ విధుల్లో ఓ పెళ్లి కూతురు స్కూటీపై హల్ చల్ చేసింది. పెళ్లి దుస్తుల్లో స్టైల్గా డ్రైవ్ చేస్తూ దూసుకుపోయింది. హెల్మెట్ ధరించకుండానే రయ్య రయ్య మంటూ రోడ్డుపై వెళ్లింది. ఆ తర్వాత తన డ్రైవ్కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోకు బ్యాక్ గ్రౌండ్లో సజ్నాజీ వారీ వారీ పాటను యాడ్ చేసింది. ఈ వీడియో వైరల్ అయింది. 

యువతికి పోలీసుల షాక్

హెల్మెట్ లేకుండా..ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ఢిల్లీ రోడ్లపై దూసుకుపోయిన పెళ్లి కూతురుకు అక్కడి పోలీసులు షాకిచ్చారు.  నిబంధనలు పాటించకపోవడంతో యువతికి చలాన్ విధించారు. మొత్తం రూ. 6వేల  జరిమానా విధించారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపినందుకు రూ. 1,000, లైసెన్స్ లేకుండా నడిపినందుకు మరో రూ. 5,000 మొత్తం రూ. 6వేల చలాన్ వేశారు. యువతి డ్రైవ్ చేసిన వీడియోను ఎడిట్ చేసిన పోలీసులు..మరో పాటను జోడించి చలాన్ వేసిన ఫోటోను యాడ్ చేసి పోలీసుల అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అంతేకాదు రీల్ కోసం ఇలాంటి వీడియోలు చేస్తే.. లైఫ్‌ రిస్క్‌లో పడే ప్రమాదం ఉందని  క్యాప్షన్‌ పెట్టారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అయింది.