మధ్యప్రదేశ్ లో 19 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ 

మధ్యప్రదేశ్ లో 19 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ 

దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో  ఇవాళ ఉదయం తేలికపాటి వర్షం కురిసింది. దీంతో మార్నింగ్ వాకర్స్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వెదర్ కూల్ గా మారిపోవడంతో ఆకాశం మేఘావృతమైంది. మరో వైపు పొగ మంచు విపరీతంగా కురుస్తోంది. రాబోయే 24 గంటల్లో ఢిల్లీలో చలిగాలులు వీచే అవకాశం ఉందంటున్నారు వాతావరణశాఖ అధికారులు. ఇక మధ్యప్రదేశ్ లో మాత్రం వడగళ్లతో కూడిన వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన గాలివాన పడటంతో 19 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. రాబోయే నాలుగు రోజుల్లో వాయువ్య భారతదేశంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. 

India Meteorological Department on Twitter: "22/01/2022: 02:10 IST; Light intensity rain would occur over and adjoining areas of entire Delhi and NCR (Loni Dehat, Hindon AF Station, Ghaziabad, Indirapuram, Chhapraula, Noida, Dadri, Greater Noida, Gurugram, Faridabad, Manesar, Ballabhgarh) Kurukshetra, Kaithal, Narwana," / Twitter


మరిన్ని వార్తల కోసం

కేజ్రీవాల్​పై పరువునష్టం కేసు పెడ్త

కరోనా కేసులు కొంచెం తగ్గినయ్