కరోనా కేసులు కొంచెం తగ్గినయ్

కరోనా కేసులు కొంచెం తగ్గినయ్

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు 3 లక్షల 37 వేల 704 కేసులు నమోదయ్యాయి. మరో 488 మంది మరణించారు. అయితే నిన్నటితో పోలిస్తే కొత్తగా నమోదైన కేసులు 9,550 తక్కువగా ఉండడం కొంత ఊరట కలిగిస్తోంది. అలాగే గడిచిన 24 గంటల్లో 2 లక్షల 42 వేల 676 మంది కోలుకున్నట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో 17.22 శాతం పాజిటివిటీ రేటు ఉందన్నారు అధికారులు. మొత్తం 21 లక్షల 13 వేల 365 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 10 వేల 050 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. నిన్నటితో పోలిస్తే ఒమిక్రాన్ కేసులు 3.69 శాతం పెరిగాయి.

మహారాష్ట్ర, కర్ణాటక, కేరళలో కొవిడ్ పంజా విసురుతోంది. మహారాష్ట్రలో కొత్తగా 48 వేల 270 కేసులు నమోదు కాగా, 52 మంది చనిపోయారు. కర్ణాటకలో కొత్తగా 48 వేల 49 కేసులొచ్చాయి.22 మంది మరణించారు. కర్ణాటకలో 19.23 శాతంగా పాజిటివిటీ రేటు ఉందన్నారు అధికారులు. కేరళలో 41 వేల 668 కొత్త కరోనా కేసులు రాగా.. 33 మంది చనిపోయారు. తమిళనాడులో 29 వేల 870 కేసులు రాగా.. 33 మంది ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలో కరోనా తీవ్రత కొద్దిగా తగ్గింది. ఢిల్లీలో కొత్తగా 10 వేల 756 కేసులు రాగా... 38 మంది చనిపోయారు. పశ్చిమ బెంగాల్ లో కొత్తగా 9 వేల 154 కేసులు రాగా..35 మంది మృతి చెందారు.

మరిన్ని వార్తల కోసం..

నిరుడు ఏకంగా రూ.1,350 కోట్ల లోన్లు తీసుకున్న ఆర్టీసీ

మామయ్య బ్లెస్సింగ్స్ తీస్కున్నా

చిన్నారుల కోసం  బ్లూ ఆధార్ కార్డ్