చిన్నారుల కోసం  బ్లూ ఆధార్ కార్డ్  

చిన్నారుల కోసం  బ్లూ ఆధార్ కార్డ్  

న్యూఢిల్లీ: సిటిజన్ల కోసం ప్రత్యేక గుర్తింపు రుజువుగా ప్రభుత్వం ఆధార్ కార్డులను అందిస్తున్నది. ప్రస్తుతం బ్యాంకులు,  ఇతర ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల సేవలను పొందేందుకు ఆధార్ కార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తప్పనిసరి. అయితే ఐదేళ్లలోపు చిన్నారుల కోసం ప్రభుత్వం 'బ్లూ బాల్​ ఆధార్ కార్డు'లను ప్రారంభించింది.  యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) జారీ చేసిన ఆధార్​కార్డుకు12- అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఉంటుంది.   బ్లూ ఆధార్ కార్డులో కూడా 12 అంకెలు ఉంటాయి.అయితే చిన్నారుల వయస్సు 5 సంవత్సరాలు దాటిన తర్వాత ఇది చెల్లదు. సాధారణంగా అయితే, ఆధార్ కార్డ్‌‌‌‌‌‌‌‌లో కార్డుహోల్డర్​ వేలిముద్రలు,  రెటీనా వివరాలు కూడా ఉంటాయి. ఈ కార్డు ప్రత్యేక గుర్తింపు సంఖ్యను ఒక్కరే వాడాలి. అయితే, బ్లూ బాల్ ఆధార్ కార్డ్‌‌‌‌‌‌‌‌లో అలాంటి సమాచారం ఏదీ ఉండదు. ప్రత్యేక సంఖ్య కూడా ఉండదు. పిల్లవాడు పెరిగి 5 ఏళ్లు దాటిన తర్వాత వివరాలను అప్‌‌‌‌‌‌‌‌డేట్ చేయాలి.  వేలిముద్రలను యూఐడీఏఐకి ఇవ్వాలి.  యూఐడీఏఐ ఈ కార్డును పాఠశాలల్లో అడ్మిషన్ సమయంలో డాక్యుమెంట్ ప్రూఫ్‌‌‌‌‌‌‌‌గా ఉపయోగించుకోవచ్చు. సాధారణంగా, స్కూల్ అడ్మిషన్ల సమయంలో తల్లిదండ్రులు బర్త్ సర్టిఫికెట్​ను ఉపయోగిస్తారు.

బ్లూ ఆధార్ కార్డ్ ..ఎలా పొందాలంటే

తల్లిదండ్రులు అవసరమైన డాక్యుమెంట్లతోపాటు సమీపంలోని ఆధార్ కార్డు నమోదు కేంద్రానికి వెళ్లాలి. వెంట అడ్రస్ ప్రూఫ్,  చిన్నారుల బర్త్ సర్టిఫికెట్ తీసుకెళ్లాలి. మొదట దరఖాస్తు ఫారమ్‌‌‌‌ను నింపాలి.  దానితో పాటు సర్టిఫికెట్లను జతచేయాలి. తల్లిదండ్రులు కూడా తమ సొంత ఆధార్ సమాచారాన్ని అందించాలి. బ్లూ బాల్ ఆధార్ కార్డ్  కోసం మొబైల్ నంబర్లను కూడా ఇవ్వాలి. రిజిస్ట్రేషన్ కేంద్రంలో చిన్నారుల ఫోటోను తీస్తారు. ఈ ఫోటో ఆధార్ కార్డుపై ఉంటుంది. డాక్యుమెంట్లను కూడా వెరిఫై చేస్తారు. తర్వాత పేర్కొన్న మొబైల్ నంబర్‌‌‌‌కు మెసేజ్ వస్తుంది. వెరిఫికేషన్ జరిగిన  60 రోజులలోపు బాల్ ఆధార్ కార్డ్ జారీ అవుతుందని యూఐడీఏఐ తెలిపింది.