గుజరాత్ పర్యటనలో మంత్రి వివేక్.. ‘‘రాష్ట్రీయ ఖనిజ చింతన్ శిబిర్ 2026’కు హాజరు

గుజరాత్ పర్యటనలో మంత్రి వివేక్..  ‘‘రాష్ట్రీయ ఖనిజ చింతన్ శిబిర్ 2026’కు హాజరు
  •     గనుల కార్యకలాపాలు, ఖనిజాల మిషన్​పై చర్చ

హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తు న్న ‘‘రాష్ట్రీయ ఖనిజ చింతన్ శిబిర్ 2026’లో పాల్గొనేందుకు రాష్ట్ర మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి గురువారం గుజరాత్​లోని గాంధీనగర్​కు చేరుకున్నారు. ఈ శిబిరంలో గనుల కార్యకలాపాల అమలు, కీలక ఖనిజాల మిషన్, గనుల తవ్వకాలు, గ్రేడింగ్​లో తప్పులు దొర్లకుండా నియంత్రించేందుకు సాంకేతికత వినియోగం, వేలం ప్రక్రియ వంటి అంశాలపై చర్చించనున్నారు. 

ఈ నెల 10 వరకు కొనసాగనున్న సదస్సుకు కేంద్ర మైనింగ్ శాఖ మంత్రి కిషన్ రెడ్డి, జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్, కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, గుజరాత్ సీఎం భూపేంద్ర పాటిల్ అటెండ్ కానున్నారు. అలాగే, గనుల రంగంలో రాష్ట్రాలు అమలు చేస్తున్న సరికొత్త విధానాలు, సాధించిన విజయాలను పంచుకునే అవకాశం కూడా కల్పించనున్నారు. 

పరస్పర అనుభవాల ద్వారా నేర్చుకునే వేదికగా ఈ శిబిరం నిలవనున్నది. మైనింగ్ రంగంలో వాటాదారులతో కలిసి పనిచేయడానికి, సంస్కరణలను ముందుకు తీసుకెళ్లడానికి గనుల మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. అన్ని రాష్ట్రాల మైనింగ్ శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు అటెండ్ అవుతుండగా అందరి నుంచి సలహాలు, సూచనలు, సిఫార్సులను కేంద్ర మైనింగ్ శాఖ తీసుకోనున్నది.