హైదరాబాద్, వెలుగు: అమెజాన్ పే ఫిక్స్‌డ్ డిపాజిట్ల (ఎఫ్‌డీ) సేవలను ప్రారంభించింది. దీని కోసం ఐదు బ్యాంకులు, రెండు ఎన్బీఎఫ్సీ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంది. శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ వంటి సంస్థల ద్వారా కస్టమర్లు రూ. వెయ్యి నుంచి డిపాజిట్లు చేయవచ్చు. గరిష్టంగా ఎనిమిది శాతం వరకు వార్షిక వడ్డీ పొందవచ్చు. సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.5 శాతం వడ్డీ లభిస్తుంది.
మహిళలకు కూడా కొన్ని సంస్థలు ఎక్కువ వడ్డీ ఇస్తున్నాయి. ప్రత్యేక బ్యాంక్ ఖాతా అవసరం లేకుండానే పూర్తి డిజిటల్ పద్ధతిలో డిపాజిట్లు చేయవచ్చు. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ ద్వారా రూ.ఐదు లక్షల వరకు బీమా ఉంటుందని అమెజాన్ పే తెలిపింది.
