జీతం ఇవ్వనందుకు కంపెనీకే కన్నం వేసాడు.. పాపం కొట్టేసిన కొద్దిసేపటికే దొరికిపోయాడు..

 జీతం ఇవ్వనందుకు కంపెనీకే కన్నం వేసాడు.. పాపం కొట్టేసిన కొద్దిసేపటికే దొరికిపోయాడు..

ఢిల్లీలో ఒక విచిత్రమైన దొంగతనం వెలుగులోకి వచ్చింది. 22 ఏళ్ల ముంతాజ్ అనే ఉద్యోగి కంపెనీ జీతం అడ్వాన్స్ గా  ఇవ్వనందుకు కోపంతో ఏకంగా కంపెనీకే కన్నం వేసాడు. అయితే అతను రూ.4.5 లక్షలు చోరీ చేయగా, కేవలం 8 గంటల్లోనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

ఎలా జరిగిందంటే : ఈ నెల ఆగస్టు 19న అర్ధరాత్రి కంపెనీలో దొంగతనం జరిగింది. నజాఫ్‌గఢ్‌లో ఉన్న ముకుల్ జైన్ అనే వ్యక్తికి చెందిన ఈ  కంపెనీలో ఈ చోరీ జరిగింది. నిందితుడు ముంతాజ్ తలకి ఒక ప్లాస్టిక్ కవర్ కప్పుకొని సెక్యూరిటీ కెమెరాలను ఆఫ్ చేసి, తర్వాత పైకప్పు నుంచి కంపెనీలోకి వెళ్లి డబ్బులు దొంగిలించాడు. విచారణలో ముంతాజ్ చెప్పిన మాటలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. అడ్వాన్స్  జీతం కోసం అడిగినప్పుడు ఓనర్ ఇవ్వలేదని అందుకే నిరాశతో అతనికి గుణపాఠం చెప్పాలని అలాగే ఈజీగా డబ్బు సంపాదించాలని ఉద్దేశంతో ఈ దొంగతనం చేసినట్లు  ఒప్పుకున్నాడు.

ముంతాజ్‌కు కంపెనీ భద్రత గురించి బాగా తెలుసునని, అక్కడ ఉన్న కుక్కలకు కూడా అతను తెలుసు.. దింతో అవి అరువలేదని పోలీసులు తెలిపారు. అతను కెమెరాలను ఆఫ్ చేసి, పైకప్పు నుండి లోపలికి వెళ్లి డబ్బుతో పారిపోవడానికి వికాస్ అనే మరో వ్యక్తి  సహకరించినట్లు పోలీసులు చెబుతున్నారు.  అయితే ఈ కేసులో పోలీసులు రూ.3.14 లక్షల నగదును స్వాధీనం చేసుకోని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.