ప్రజాపాలనలో వేగంగా అభివృద్ధి పనులు

ప్రజాపాలనలో వేగంగా అభివృద్ధి పనులు
  • డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  • ఎర్రపాలెంలో మండలంలో పలు పనులకు శంకుస్థాపన

ఎర్రుపాలెం, వెలుగు : ప్రజాపాలనలో ప్రతి పల్లెలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.  మంగళవారం మండలంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ.45లక్షలతో ఎర్రుపాలెం ఎస్సీ కాలనీలో, రూ.85 లక్షలతో పెద్దగోపవరంలో, రూ.12లక్షలతో నిర్మించనున్న అంగన్​వాడీ కేంద్రం కొత్త భవనానికి, రూ.40 లక్షలతో బుచ్చిరెడ్డిపాలెంలో, రూ.175లక్షలతో బనిగండ్లపాడులో, రూ.55 లక్షల నిధులతో నిర్మించే ఎస్సీ  సబ్ ప్లాన్ రోడ్ల పనులకు, భీమవరం విద్యానగర్ లో రూ.20 లక్షలతో నిర్మించనున్న  గ్రామపంచాయతీ నూతన భవనాకి ఆయన శంకుస్థాపనలు చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ మధిర నియోజకవర్గ ప్రత్యేక అభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రతి గ్రామాన్ని  అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఆర్డీవో జి.నరసింహారావు, ఎంపీడీసీఎల్ ఎస్ఈ శ్రీనివాసచారి, భద్రాద్రి జిల్లా డీఎఫ్ఓ సిద్ధార్థ విక్రమ్ సింగ్, పీఆర్ఏఈ వెంకటరెడ్డి, తహసీల్దార్ మన్నె ఉషా శారద, ఎంపీడీవో బి.సురేందర్, వివిధ శాఖల అధికారులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, కొండబాల కోటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ పొట్ల  నాగేశ్వరరావు, నాయుడు సత్య నారాయణ, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు, మండల పార్టీ అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, చావా రామకృష్ణ పాల్గొన్నారు. అనంతరం డిప్యూటీ సీఎం మామునూరు రెవెన్యూ పరిధిలోని ఇంద్రమ్మ చెరువును పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్  తో కలిసి  పరిశీలించారు.