తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్: డిప్యూటీ సీఎం భట్టి

తలసరి ఆదాయంలో  తెలంగాణ నంబర్ వన్: డిప్యూటీ సీఎం భట్టి

 

  • కర్నాటక, హర్యానాలను మించి రికార్డు
  • ఇందిరమ్మ ఇళ్లకు, స్వయం ఉపాధి పథకాలకు  రుణాలివ్వండి
  • వార్షిక రుణ ప్రణాళికలో మొదటి క్వార్టర్ లోనే 33.64% అభినందనీయం
  • బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్: తలసరి ఆదాయంలో తెలంగాణ మొట్టమొదటి స్థానంలో నిలిచిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ ఆయన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడారు. కర్నాటక, హర్యానాలను మించి రికార్డు సాధించారని తెలిపారు.  వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగాల్లో స్థిరమైన వృద్ధిని రాష్ట్రం సాధించిందని అన్నారు.  

వార్షిక రుణ ప్రణాళికలో మొదటి క్వార్టర్ లోనే 33.64% సాధించడం  అభినందనీయమని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు, స్వయం ఉపాధి పథకాలకు, వ్యవసాయ అనుబంధ రంగాలకు విరివిగా రుణాలివ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా భావిస్తుందని చెప్పారు.  రైతుల పక్షాన రైతు రుణమాఫీ, రైతు భరోసా పేరిట 30 వేల కోట్లు రైతుల పక్షాన బ్యాంకులకు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. బ్యాంకింగ్ రికవరీ చరిత్రలో ఇది ఒక రికార్డని అన్నారు. రైతులకు సకాలంలో రుణాలు ఇవ్వాలని కోరారు.  తాకట్టు పెట్టిన ఆస్తుల రికవరీ, ఫిక్స్ డ్  డిపాజిట్లు చేయాలని రైతులపై ఒత్తిడి చేయవద్దన్నారు. బ్యాంకర్లు మానవీయ కోణంలో ఆలోచించాలని డిప్యూటీ సీఎం సూచించారు.