రెస్టారెంట్లలో జీఎస్టీతోపాటు సర్వీస్ ఛార్జీలు కడుతున్న కస్టమర్లు

రెస్టారెంట్లలో జీఎస్టీతోపాటు సర్వీస్ ఛార్జీలు కడుతున్న కస్టమర్లు

రెస్టారెంట్ల యాజమాన్యం వినియోగ దారులను దోచుకుంటున్నాయని ఇటీవల నిర్వహించిన సర్వేల్లో తేలింది.  జీఎస్టీతో పాటు సర్వీస్ ఛార్జీలు ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. సర్వీస్ ఛార్జీలు వసూలపై ప్రభుత్వ మార్గదర్శకాలను రెస్టారెంట్ల్ పాటించడం లేదని ఇటీవల నిర్వహించిన లోకల్ సర్కిల్ సర్వేలో తేలింది. లోకల్ సర్కిల్స్ నివేదిక ప్రకారం..ఈ మధ్య కాలంలో ఎయిర్ కండిషన్డ్ రెస్టారెంట్లలో వినియోగదారులు సేవలతో సంతృప్తి చెందనప్పటికీ అధిక సేవా ఛార్జీలు చెల్లిస్తున్నారు. భారతదేశంలోని 303 జిల్లాల పౌరుల నుంచి  ఈ సర్వేకు 11వేల కంటే ఎక్కువ ప్రతిస్పందనలు వచ్చాయి. వీరిలో 43 శాతం మంది ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. అయితే 9 శాతం మంది మాత్రం సర్వీస్ ఛార్జీలను తొలగించాలని డిమాండ్ చేశారు.

ALSO READ:ఈ ఐదు ఫ్రూట్స్ తీసుకుంటే.. అరుగుద‌ల బాగుంటుంది

రెస్టారెంట్లపై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) జారీ చేసిన నిషేధంపై ఢిల్లీ హైకోర్టు స్టే ఇవ్వడంతో సేవా ఛార్జీ ఆటోమేటిక్ లెవీపై వివాదం నెలకొంది. గత నెలలో నోయిడా రెస్టారెంట్‌లో ఈ సమస్యపై భోజనప్రియులకు మరియు సిబ్బందికి మధ్య జరిగిన వాగ్వాదం మొత్తం గొడవకు దారితీసింది .సర్వీస్ ఛార్జీపై నిషేధం కోసం CCPA జూలై 2022లో మార్గదర్శకాలను జారీ చేసింది. అయితే దీనిని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI) మరియు ఫెడరేషన్ ఆఫ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్స్ కోర్టులో సవాలు చేశాయి.

"సర్వేలో పాల్గొన్న 11,066 మందిలో 43% మంది ‘‘రెస్టారెంట్ ఛార్జీ విధించింది.  మేము చెల్లించాము’’ అని చెప్పారు... 9శాతం మంది మాత్రమే సేవా ఛార్జీలను తొలగించాలని తెలిపారని సర్వే నివేదిక పేర్కొంది.