కరోనా కష్టాలను చూపిస్తున్న.. ది వ్యాక్సిన్ వార్ ట్రైలర్

కరోనా కష్టాలను చూపిస్తున్న.. ది వ్యాక్సిన్ వార్ ట్రైలర్

ది కాశ్మీర్ ఫైల్స్(The Kashmir files) లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి(Vivek Agnihotri) నుంచి వస్తున్న చిత్రం ది వ్యాక్సిన్ వార్(The Vaccine War). అనుపమ్ ఖేర్, సప్తమి గౌడ, పరితోష్ శాండ్, స్నేహ మిలాండ్, దివ్య సేథ్ నటిస్తున్నారు. కొవిడ్ వ్యాక్సిన్ డ్రిల్స్ బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పల్లవి జోషి  నిర్మిస్తూ, కీలక పాత్రలో నటిస్తున్నారు. లేటెస్ట్గా ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. 

ఈ ట్రైలర్లో కరోనా టైంలో నెలకొన్న ప్రాబ్లమ్స్, ప్రజల్లో కలిగిన భయాందోళనలు,అందుకు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు కళ్ళకి కట్టినట్లు చూపించారు. ప్రతి ఒక్కరు పేస్ చేసిన కరోనా ప్యాండమిక్ సిట్యుయేషన్ని డైరెక్టర్ చాలా బాగా చూపించారు. టీకా కనిపెట్టడానికి భారత్ సైంటిస్ట్ లు ఎదురుకున్న సవాళ్లు అన్నిటిని ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. 

 వివేక్ అగ్నిహోత్రి స్టోరీ మొత్తాన్ని చాలా ఇంటెన్సివ్ గా డిజైన్ చేసినట్లు అర్ధం అవుతుంది. ఇండియా వాక్సిన్ తయారు విషయంలో ఓ యుద్ధమే చేసినా, అది మార్కెట్లోకి రాకుండా అంతర్జాతీయంగా జరిగిన కుట్రలను ఈ సినిమాలో ప్రస్తావించారు. మరోవైపు మన దేశంలో వ్యాక్సిన్ వేసుకునే విషయంలో ప్రజలను తప్పుదారి పట్టించిన కొంత మంది రాజకీయ నాయకుల అసలు రూపాన్ని కూడా చూపించారు. 

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్‌‌ మెడికల్ రీసెర్చ్’ డైరెక్టర్ జనరల్‌‌ ప్రొఫెసర్ బలరామ్ భార్గవ రాసిన ‘గోయింగ్ వైరల్‌‌.. మేకింగ్ ఆఫ్‌‌ కో వ్యాక్సిన్‌‌’ అనే బుక్ ఆధారంగా ఈ సినిమా తీస్తున్నారు వివేక్.ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో 28 సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ న 11 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.