ములుగు మండలంలోని హనుమాన్ ఆలయ స్థలంపై వివాదం..జాగ కాపాడాలని గ్రామస్థుల దీక్ష

ములుగు మండలంలోని హనుమాన్ ఆలయ స్థలంపై వివాదం..జాగ కాపాడాలని గ్రామస్థుల దీక్ష
  •     అక్రమంగా రిజిస్ట్రేషన్  అని ఆరోపణ

ములుగు, వెలుగు: సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలనీలో హనుమాన్ ఆలయ నిర్మాణానికి గత ప్రభుత్వం కేటాయించిన స్థలంపై వివాదం నెలకొంది. తనేదార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి, తనేదార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి తండా గ్రామాల ప్రజల కోసం కేటాయించిన విలువైన స్థలాన్ని కొందరు స్థానిక నాయకులు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని, రెవెన్యూ ఆఫీసర్ల సహకారంతో ప్రైవేటు వ్యక్తుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హనుమాన్ ఆలయ నిర్మాణానికి స్థలం కేటాయించడంతో పాటు ప్రభుత్వ నిధులతో పనులు ప్రారంభించారు. కొన్ని కారణాలతో నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది. ఈ క్రమంలో విలువైన ఆలయ స్థలంపై కొందరు కన్నేశారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవాలయ నిర్మాణానికి కేటాయించిన భూమిని ప్రైవేటు వ్యక్తుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేయడం రెండు గ్రామాల ప్రజలకు అన్యాయం చేయడమేనని పేర్కొంటున్నారు.

గ్రామస్థుల దీక్ష..

ఆలయ స్థల వివాదంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రెండు గ్రామాల ప్రజలు సోమవారం స్థలం వద్ద టెంట్ వేసి దీక్ష చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి, జుబేర్ పాషా, సీనియర్ నాయకుడు లింగారెడ్డి తదితరులు దీక్షా శిబిరాన్ని సందర్శించి గ్రామస్తులకు మద్దతు తెలిపారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఇతర బీఆర్ఎస్ నాయకులు గజ్వేల్ ఆర్డీవోతో ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాట్లాడి ఆలయ స్థలాన్ని కాపాడాలని, వివాదాన్ని పరిష్కరించి రెండు గ్రామాల ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. సమస్య పరిష్కారమయ్యే వరకు గ్రామస్తులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అవసరమైతే రిలే నిరాహార దీక్షలతో పాటు తహసీల్దార్, ఆర్డీవో ఆఫీసుల ఎదుట నిరసనలు చేపడతామని స్పష్టం చేశారు.