V6 News

పోలీసుల అదుపులో దువ్వాడ శ్రీనివాస్, మాధురి.. అసలు ఏం జరిగిందంటే..

పోలీసుల అదుపులో దువ్వాడ శ్రీనివాస్, మాధురి.. అసలు ఏం జరిగిందంటే..

హైదరాబాద్: మొయినాబాద్ The Pendent ఫామ్ హౌస్పై రాజేంద్రనగర్ ఎస్ఓటి పోలీసులు దాడులు చేశారు. అనుమతి లేకుండా మద్యం సేవించి.. బర్త్ డే పార్టీ చేస్తున్న దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం రాత్రి ఫామ్ హౌస్లో పార్టీ జరిగింది. ఈ ఫామ్‌ హౌస్‌లో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ ప్రధాన అనుచరుడు పార్థసారథి పుట్టిన రోజు వేడుకలు జరిగాయి.

డిసెంబర్ 12న మాధురి బర్త్ డే కూడా కావడంతో వేడుకలను ఘనంగా చేయాలని పార్థసారథి పేరుపై ఫామ్‌హౌస్‌ను బుక్‌ చేసినట్లు తెలిసింది. మొత్తం ఈ బర్త్ డే పార్టీలో 29 మంది పాల్గొన్నారు. అనుమతి లేకుండా లిక్కర్ పార్టీ నిర్వహిస్తున్నారనే సమచారంతో స్థానిక పోలీసులతో కలిసి రాజేంద్ర నగర్‌ ఎస్‌ఓటీ పోలీసులు ఫామ్‌హౌస్‌పై దాడులు చేశారు.

ఐదు హుక్కా బాటిళ్లు, 10 స్కాచ్‌ బాటిళ్లు, ఇతర మత్తు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు, వారిని అదుపులోకి తీసుకున్నారు. పెండెంట్ ఫామ్ హౌస్ పార్టీపై పోలీసుల కేసు నమోదు చేశారు. పార్టీ ఆర్గనైజర్ పార్థసారథి, ఫార్మ్ హౌస్ ఓనర్ సుభాష్ పై కేసులు  నమోదు చేశారు. 223, 34 ఎక్సైజ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేయడం గమనార్హం. దువ్వాడ మాధురి, శ్రీనివాస్తో కలిపి 29 మంది ఈ పార్టీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.