గ్రానైట్ పరిశ్రమను మాఫియాతో పోల్చొద్దు

గ్రానైట్ పరిశ్రమను మాఫియాతో పోల్చొద్దు
  • కరీంనగర్ గ్రానైట్ క్వారీ యజమానుల అసోసియేషన్

కరీంనగర్: గ్రానైట్ రవాణాకు సంబంధించి ఇటీవల చెన్నైలోని ఎలైట్ ఎక్స్ పోర్ట్ సంస్థకు ఈడి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కరీంనగర్ గ్రానైట్ క్వారీ యజమానుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కరపత్రం విడుదల చేసినట్లు తెలుస్తోంది. అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. సోషల్ మీడియాలో కరపత్రం వైరల్ అవుతోంది. గ్రానైట్ క్వారీలకు ఈ డి నుంచి ఎలాంటి నోటీసులు రాలేదని విపులంగా వివరణ ఉంది. కొంతమంది కుట్రపూరితంగా గ్రానైట్ పరిశ్రమను మాఫియాగా చిత్రీకరిస్తూ  తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అసోసియేషన్ పేర్కొంది. 
ఇలాంటి ప్రచారాలు ఆపకపోతే  చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అసోసియేషన్ నేతలు కరపత్రంలో పేర్కొన్నారు. మీడియా సంస్థలు కూడా కొంతమంది స్వార్థపరులు చెప్పే విషయాలు నమ్మకుండా తమతో వివరణ తీసుకొవాలని యజమానుల సంఘం కోరింది. కరపత్రం పూర్తి పాఠం ఇదే...