హైదరాబాద్: ఇంటి నిర్మాణ అనుమతి కోసం వచ్చిన వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా చిక్కాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. తుంగతుర్తి మండలం గానుగుబండ గ్రామ పంచాయతీ కార్యదర్శి బరపటి కృష్ణ ఇంటి నిర్మాణ అనుమతి కోసం వచ్చిన ఓ వ్యక్తి నుంచి రూ.6 వేలు లంచం డిమాండ్ చేశాడు.
దీంతో లంచం ఇయ్యడానికి ఇష్టపడని బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ సూచన మేరకు శుక్రవారం (జనవరి 9) బాధితుడు గ్రామ పంచాతీయ కార్యదర్శికి లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. గ్రామ పంచాతీయ కార్యదర్శి బరపటి కృష్ణపై ఏసీబీ అధికారుల విచారణ కొనసాగుతోంది.
