
ఛాట్ భండార్ దగ్గర నిలబడి తింటున్నారంటే అర్థం ఉంది. అది రోడ్డు పక్కన ఉంటుంది కాబట్టి కుర్చీలు, టేబుళ్లు వేసేంత ప్లేస్ ఉండదు.. తినేది కూడా తక్కువగా ఉంటుంది.. కానీ ఈ మధ్య పెళ్లిళ్లు, పేరంటాళ్లలో కూడా బఫే సిస్టమ్, నిలబడి భోజనం చేయడం ఫ్యాషన్ అయిపోయింది.. అయితే ఈ నిలబడి తినడం అనేది ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. అయితే ఇది ఖచ్చితంగా మిమ్మల్ని వ్యాధుల బారిన పడేలా చేస్తుంది. నిలబడి భోజనం చేయడం వల్ల వచ్చే వ్యాధుల గురించి తెలుసుకుందాం..
ఒక్కోసారి కూర్చుని తినేంత తీరిక ఉండదు.. దాంతో నిలబడే గబగబా నోట్లో రెండు ముద్దలు పెట్టుకుని పరిగెట్టేస్తుంటారు. కానీ తినేది ఒక్క ముద్ద అయినా కూర్చుని తినమంటున్నారు నిపుణులైన వైద్యులు. నిలబడి తినే విధానం సమయాన్ని ఆదా చేస్తుందని అనుకుంటారు.ఈ విధంగా తినడం అనేక అనారోగ్యాలకు దారితీస్తుందని అంటున్నారు.
సాధారణంగా భోజనం చేసేటప్పుడు హిందూ సాంప్రదాయం ప్రకారం నేలపై కూర్చొని తినాలి అని పెద్దలు చెబుతూనే ఉంటారు. అంతేకాదు ఇదే పద్ధతిని ఇప్పటికీ చాలామంది ఫాలో అవుతున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ప్రజాజీవనం మొత్తం ఉరుకుల పరుగులమయం అవుతున్న నేపథ్యంలో పెరుగుతున్న ధరల దృష్ట్యా ఒక్క జాబుతో బతకలేని పరిస్థితి ఏర్పడింది.అందుకే ప్రతి ఒక్కరు కూడా రెండో జాబు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. దీంతో తినడానికి కూడా టైం ఉండడం లేదు. అందుకే బయట తినే వారి సంఖ్య ఇప్పుడు ఎక్కువైపోయింది పెళ్లిళ్లలో, లేదా ఏదైనా ఫంక్షన్స్ లో నిలబడే తింటారు. ఒకసారి అయితే ఫర్వాలేదు కానీ అదే పనిగా తరచూ నిలబడి తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
నిలబడి తినడం వలన కలిగే సమస్యలేంటో తెలుసుకుందాం..
- నిలబడి తినడంవల్ల ఆకలిపై అవగాహన ఉండదు. ఎక్కువ తీసుకుంటారు.
- నిలబడి తినడంవల్ల పేగులు కుంచించుకుపోతాయి.
- తిన్నది జీర్ణం కాదు.కడుపు నిండి, అసౌకర్యానికి గురవుతారు.
- కాళ్లు, తుంటిపై చెడు ప్రభావం ఉంటుంది. ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.
- గొంతు నుంచి నేరుగా కడుపులోకి వెళుతుంది. దీనివల్ల అన్నవాహికపై దుష్ప్రభావం పడుతుంది. దీనివల్ అల్సర్లు వస్తాయి.
- ఆహారం నేరుగా జీర్ణాశయంలోకి వెళ్లిపోతుంది. కడుపునొప్పి, ఉబ్బరానికి దారితీస్తుంది. అంతేకాదు.. శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది.
- అజీర్తి, మలబద్దకం, ఆమ్లత్వం వంటి సమస్యలు ఉన్నాయి. కొన్నిసార్లు చంచల స్వభావం కలుగుతుంది.
- వ్యక్తి నిలబడి భోజనం చేస్తున్నప్పుడు, వారి మనస్సు విశ్రాంతి తీసుకోదు. చికాకు మొదలవుతుంది.
- నిలబడి ఆహారం తినడం వల్ల ఊబకాయం వచ్చే అవకాశం ఉంది
- నిలబడి తినేవారు ఆహారాన్ని సరిగ్గా నమలలేరు. దీని వలన జీర్ణక్రియలో పలు సమస్యలు వస్తాయి.
భోజనం కోసం కూర్చోవడం వల్ల మీరు తినే వేగాన్ని తగ్గించే అవకాశం ఉంది. మీరు తీసుకునే కేలరీల సంఖ్య కూడా తగ్గుతుంది. నెమ్మదిగా తినడం వల్ల ఆకలి తగ్గుతుందని అనేక అధ్యయనాలు చూపిస్తున్నాయి. భోజనానికి కూర్చోవడం వల్ల మీరు నిజమైన భోజనం తిన్నారని మీ మెదడుకు సంకేతాలు అందుతాయి. కాబట్టి ఇకపై ఎప్పుడూ కూడా నిలబడి తినడానికి ప్రయత్నం చేయకండి.