పాలస్తీనాను విమర్శించిండని జాబ్​లోంచి తీసేసిన్రు

పాలస్తీనాను విమర్శించిండని జాబ్​లోంచి తీసేసిన్రు

మనామ(బహ్రెయిన్): పాలస్తీనాకు వ్యతిరేకంగా ట్వీట్లు చేసినందుకు బహ్రెయిన్‌‌‌‌లో ఉంటున్న మనదేశ సంతతికి చెందిన డాక్టర్​ సునీల్​ రావు ఉద్యోగం కోల్పోయారు. రాయల్ హాస్పిటల్​లో ఆయన మెడిసిన్ స్పెషలిస్ట్​గా పనిచేస్తున్నారు. సునీల్​ రావును తొలగిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు శుక్రవారం ప్రకటించాయి.

 పాలస్తీనాకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోస్ట్​లు తమ సమాజాన్ని అవమానించేలా ఉన్నాయని పేర్కొన్నాయి. ‘‘సునీల్ రావు చేసిన ట్వీట్లతో ఆస్పత్రికి ఎలాంటి సంబంధం లేదు. అవి ఆయన వ్యక్తిగతం. ఆయన పోస్ట్​లు వైద్య వ్యవస్థకే అవమానకరం. అందుకే ఆయనను తొలగిస్తున్నాం. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం”అని ఆస్పత్రి ప్రకటనలో తెలిపింది.