Be Strong : వాళ్లు వీళ్ల గురించి పట్టించుకోవద్దు.. లైట్ తీసుకోండి..!

Be Strong : వాళ్లు వీళ్ల గురించి పట్టించుకోవద్దు.. లైట్ తీసుకోండి..!

నేను సన్నగా ఉన్నా.. నేను లావుగా ఉన్నా.. నేను చాలా పొట్టి.. నేను బాగా నల్లగా ఉన్నా.. ఇలాంటి మాటలు కొందరి నోట వింటుంటాం.అలా అనే వాళ్లు నిజానికి అలాగే ఉండొచ్చు. కానీ వాళ్ల మాటల వెనుక.. రూపాన్ని చూసుకుని వాళ్లు ఫీలవుతున్నారని తెలుస్తుంది. ఇలాంటి వాళ్లు ఆత్మన్యూనతతో ఎక్కువమందితో కలవలేరు. బాగా చదువుకోలేరు. ఒంటరిగా ఉంటారు. తమ లోపం గురించి పదే పదే ఆలోచిస్తుంటారు.

 నేను ఎందుకు ఇలా ఉన్నానా అని బాధపడుతుంటారు. అదే వాళ్ల ఎదుగుదలకు అడ్డంకిగా మారుతుంది. అలాంటి వాళ్లకు కాస్త పాజిటివ్ నెస్ అలవాటు చేయాలి. వాళ్లలో ఉన్న మంచి గుణాన్ని, టాలెంట్ గురించి తెలుసుకోవాలి. దాంతో అందరికంటే భిన్నంగా పైకి ఎదగాలి. పేరు తెచ్చుకోవాలి. పుట్టుకతో వచ్చిన దాని గురించి బాధపడటం కంటే, తామేంటో నిరూపించుకునే ప్రయత్నం చేయాలి. 

సన్నగా ఉండటం, లావుగా ఉండటం, పొట్టి, పొడుగు, రంగు.. లాంటివన్నీ కేవలం చుట్టు ఉన్న కొంతమంది కల్పించిన భావాలు మాత్రమే అని గుర్తించాలి. నిజమైన అందం మానసికమైందని గుర్తించాలి. అప్పుడే జీవితంలో తామేంటో నిరూపించుకోగలుగుతారు.