సదాశివనగర్, వెలుగు : ఇందిరా మహిళా శక్తి పథకం కింద మంగళవారం మండలంలోని వజ్జపల్లి తండాలో సేవాలాల్ మహిళా సంఘం సభ్యురాలు మాలాత్ నీలకు డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మి గొర్రెలు, మేకలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుందన్నారు.
కార్యక్రమంలో సర్పంచ్ సంధ్యవిజయ్కుమార్, మండల సమాఖ్య అధ్యక్షురాలు బాలంబాయి, అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ ప్రసాద్, సీసీలు అంజాగౌడ్, ప్రతాప్, దర్ణి ఆంజనేయులు, భూమయ్య, నరేందర్ రెడ్డి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
