Good Work: బీరువాలో బట్టలు ఇలా పెట్టుకోండి.. ఏ డ్రెస్ వేసుకోవాలో వెంటనే తెలిసిపోతుంది..!

Good Work: బీరువాలో బట్టలు ఇలా పెట్టుకోండి.. ఏ డ్రెస్ వేసుకోవాలో వెంటనే తెలిసిపోతుంది..!

ఎన్ని డ్రెస్సులున్నా.. ఒక్కోసారి ఏమీ లేవు.. ఏం వేసుకోవాలి అనుకుంటారు. దానివల్ల అవసరానికి మించి షాపింగ్ చేస్తుంటారు. అయితే ఈసారి డ్రెస్సుల్ని కొనేముందు.. మీ వార్డ్ రోబ్​ ను సర్దుకోండి. అప్పుడు కొత్త డ్రెస్సులు కొనాలా.. వద్దా అని డిసైడ్ చేసుకోవచ్చు.. ఎప్పుడు ఏ డ్రెస్​ వేసుకోవాలో ఆలోచించే పనే ఉండదు.. మరి బీరువాలో డ్రస్ లు ఎలా సర్దుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . !

  • వార్డ్ రోబ్లో ఎన్ని డ్రెస్సులున్నా.. ఏం వేసుకోవాలో అర్థం కాకపోతే అన్నింటినీ ఒక్కసారి పక్కకు తీసి రంగుల వారీగా, విడి విడిగా పెట్టుకుని చూడండి.
  •  కొన్ని డ్రెస్సులు ఎప్పుడో గానీ వేసుకోం. కానీ వాటిని పడేయాలంటే మనసొప్పదు. అలాంటివి ఏమైనా ఉంటే చూసుకోండి. మరీ ఎక్కువ రోజుల నుంచి మీరు వాటిని వేసుకోకపోతే వాటిని వెంటనే తీసేయడం మంచిది.
  •  అన్ని రకాల దుస్తులు ఒకేచోట పెట్టుకుంటే గందరగోళంగా ఉంటుంది. ఆఫీసులకు. ఫంక్షన్సుకు, డైలీ వేసుకోడానికి... ఇలా సపరేట్ వరుసల్లో సర్దుకోండి. ఎప్పుడైనా షాపింగ్ కు వెళ్లేటప్పుడు ఏ రకం డ్రెస్సులు ఎక్కువగా ఉన్నాయో తెలుస్తుంది. అప్పుడు మీరు ఎరకం కొనాలో ఈజీగా తెలిసిపోతుంది.
  • మనకు తెలియకుండానే కొన్ని కలర్స్ దుస్తుల్ని ఎక్కువగా కొనేస్తాం. అయితే
  • నీట్ గా పెట్టుకోవడం వల్ల ఒక క్లారిటీ వస్తుంది.
  •  కొత్త టాప్స్ కొన్నపుడల్లా.. వాటి కోసం చున్నీలు, లెగ్గింగ్స్ తీసుకుంటాం. అయితే ఈసారి మీ దగ్గర ఇంతకుముందు కొన్న చున్నీలూ, లెగ్గింగ్​లన్నింటినీ ఒక దగ్గర
  • విడిగా సర్దిచూడండి. అపుడు కొత్తగా కొన్నవాటికి ఏమైనా సరిపోతాయేమో తెలుసుకోవచ్చు. ఖర్చులు తగ్గుతాయి.
  •  అల్మారలో కొన్ని హ్యాంగర్లకే ప్లేసు సరిపోతుంది. అలాంటప్పుడు హ్యాంగర్లకు లింక్స్ దొరుకుతాయి. వాటిని తగిలించుకుంటే ఒకదానికే రెండు జతల దుస్తుల్ని వేలాడదీయొచ్చు.
  • కొన్ని డ్రెస్సులు ప్రత్యేక సందర్భాలకు మాత్రమే బాగుంటాయి. అలాంటివాటిని రోజూ వేసుకునే వాటితో కలపకుండా విడిగా పెట్టుకోండి. అవసరమైనప్పుడు వెంటనే తీసుకుని వేసుకునేలా ఉంటాయి.
  •  ఒకసారి వేసుకున్న డ్రెస్సుల్ని వెంటనే ఉతకకండి. వాటిని కాసేపు గాలికి ఆరనిచ్చి మడతపెట్టేస్తే అవి తొందరగా కొత్తదనాన్ని కోల్పోకుండా ఉంటాయి. ఎక్కువరోజులు వస్తాయి.
  •  వారానికోసారి ల్యాండ్రీ చేయించిన డ్రెస్సులను ప్రణాళిక ప్రకారం అల్మారాలో పెట్టుకోండి. మడతలు ఒకసారి పోతే మళ్లీ పెట్టడం కుదరని పని. కాబట్టి ఓ గంట కేటాయిస్తే ఏ టెన్షన్ ఉండదు.
  • మార్నింగ్ ఆఫీస్​ కు  ఏం డ్రెస్సు వేసుకోవాలో.. ముందురోజు రాత్రే తీసిపెట్టుకోవడం బెటర్. ఇలా చేయడం వల్ల ఉదయాన్నే టైం వేస్ట్​ కాకుండా ఉంటుంది. . .