
హైదరాబాద్సిటీ, వెలుగు: దసరా సెలవులకు సిటీ జనం ఊరు బాట పట్టారు. ఈ నెల 30న సద్దుల బతుకమ్మ, అక్టోబరు 2న దసరా కావడంతో గత రెండు రోజులుగా ప్రధాన బస్స్టేషన్లలో రద్దీ నెలకొంది.
జూబ్లీ బస్ స్టేషన్, ఎంజీబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, దిల్ సుఖ్నగర్, ఎల్బీ నగర్, కేపీహెచ్బీ, ఆరామ్ ఘర్ వంటి బస్ స్టేషన్ల నుంచి భారీ సంఖ్యలో ప్రయాణికులు సొంతూర్లకు వెళ్తున్నారు. పండుగ సందర్భంగా ఆర్టీసీ 7,754 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. అక్టోబర్ 5, 6 తేదీల్లోనూ తిరుగు ప్రయాణ రద్దీకి అనుగుణంగా బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.