Good Health : ఈ ఫ్రూట్స్ తినండి.. ఈ జ్యూస్ తాగండి.. వెంటనే శక్తి, ఉత్సాహం వస్తుంది..!

Good Health : ఈ ఫ్రూట్స్ తినండి.. ఈ జ్యూస్ తాగండి.. వెంటనే శక్తి, ఉత్సాహం వస్తుంది..!

 సీజన్ ఏదైనా చాలా మంది తలనొప్పి, నీరసంతో బాధపడతారు. వీటికి తోడు రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే తరచూ జ్వరం వస్తుంది. అలాంటి వాళ్లు విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉండే జ్యూస్ లు, పండ్లు తీసుకోవాలి. అనారోగ్యంతో ఉన్న వాళ్లే కాదు ఆరోగ్యంగా ఉన్న వాళ్లు కూడా ప్రతి రోజూ ఏదో ఒక పండు లేదంటే జ్యూస్ తీసుకుంటే ఉత్సాహంగా ఉంటారు.

యాపిల్, క్యారెట్,  ఆరెంజ్

 విటమిన్-ఎ, బి6, సి, పొటాషియం, ఫోలిక్ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. యాపిల్, క్యారెట్. అరెంజ్ కలిపి మిక్సీ పట్టాలి. రుచి కోసం కొద్దిగా మిరియాల పొడి వేయాలి. ఉదయం టిఫిన్తో పాటు ఈ జ్యూస్ తీసుకుంటే తక్షణ శక్తి వస్తుంది. 

టొమాటో

టొమాటోలో విటమిన్ఎ, సి, ఐరన్, ఫోలిక్ యాసిడ్స్ ఉంటాయి. దీనిలో ఉండే ఫోలిక్ యాసిడ్స్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడతాయి. తాజా టొమాటోలతో జ్యూస్ చేసుకుంటే మంచి రుచితో పాటు ఆరోగ్యం కూడా. 

ఆరెంజ్, ద్రాక్ష

అరెంజ్, ద్రాక్షతో జ్యూస్ చేసి ప్రతి రోజూ తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీనిలో విటమిన్-ఎ, బి6, సి తో పాటు ఫోలిక్ యాసిడ్, జింక్ ఉంటాయి. ఆరెంజ్, ద్రాక్షలో విటమిన్-సి ఎక్కువగా ఉంటుంది.

 బీట్రూట్

ఒక కప్పు బీట్రూట్, చిన్న ముక్క అల్లం, కొంచెం పసుపు, ఒక కప్పు క్యారెట్ ముక్కలు కలిపి మిక్సీ పట్టాలి. వేరువేరు కూరగాయలు శరీరంలో ని రోగనిరోధక శక్తిని పెంచడానికి సహక రిస్తాయి. వీటిలో విటమిన్ -ఎ.సి.ఇ. ఐరన్, క్యాల్షియం ఎక్కువగా ఉన్నాయి.

 పుచ్చకాయ

పుచ్చకాయ జ్యూస్ రోగని రోధక శక్తిని పెంచడంలో తోడ్పడుతుంది. అంతేకాకుండా కండరాల నొప్పుల్ని తగ్గిస్తుంది. దీనిలో విటమిన్ఎ,సి, మెగ్నీషియం, జింక్ ఎక్కువగా ఉన్నాయి. ఫ్లూ లక్షణాలను త్వరగా తగ్గిస్తుంది.

స్ట్రాబెర్రీ, మామిడికాయ

వీటిలో విటమిన్-ఎ, సి, ఇ, ఐరన్, ఫోలిక్ యాసిడ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహకరిస్తాయి. మామిడికాయలోని యాంటీ ఆక్సిడెంట్స్ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి

 స్ట్రాబెర్రీ, కివీ

కివీ, స్ట్రాబెర్రీలో ఉండే విటమిన్స్ ఆరోగ్యానికి మంచివి. తాజా కివీ పండ్ల జ్యూస్ ప్యాక్ చేసిన డ్రింక్స్ కన్నా చాలా మంచిది, స్ట్రాబెర్రీ, కివీతో తయారు చేసిన జ్యూస్ పెరుగు కలిపితే మరింత మంచిది. వీటిల్లో మినరల్స్, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి.

గుమ్మడి గింజలు

గుమ్మడి గింజల్లోని విటమిన్స్, మినరల్స్ రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. దీనిలో విటమిన్-ఎ, బి6, సి, మెగ్నీషియం, జింక్ శరీరానికి శక్తిని స్తాయి. అంతేకాకుండా ఎముకలు, మూత్ర, వెంట్రుకలు, చర్మ సంబంధిత రుగ్మతలను నివారిస్తాయి.

నిమ్మజాతి

 నిమ్మజాతి పండ్లల్లో విటమిన్-సి ఎక్కువగా ఉంటుంది. ఇవి సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రా వయొలెట్ కిరణాల ప్రభావం చర్మంపై పడకుండా చేస్తాయి. ప్రతి మనిషికి రోజుకు రెండు వందల గ్రాముల విటమిన్ సి అవసరం. అయితే జ్యూస్ తాగడం కన్నా పండు రూపంలో తినడమే మంచిది.

 బొప్పాయి

 బొప్పాయి, పుచ్చకాయలో బీటా క్రిపొగ్జాంథిన్ గుణాలు ఎక్కువ. ఇవి లంగ్ క్యాన్సర్ రాకుండా చేస్తాయి. బొప్పాయిలోని పెపైన్ ఎంజైమ్ జీర్ణశక్తికి సహకరిస్తుంది. అజీర్తితో బాధపడేవారికి బొప్పాయి తీసుకుంటే మంచిది. ఇందులో విటమిన్-సి, ఎ. బి. పొటాషియం ఉంటాయి. జామపండు

జామపండులో

జీర్ణశక్తిని పెంచే ఫైబర్ ఎక్కువ. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో బాగా సహాయపడుతుంది. ఇందులో విటమిన్-ఎ, బి, క్యాల్షియం, పాస్ఫరస్ - పొటాషియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్. లాంటివి ఉంటాయి. డయాబెటిక్స్ ప్రతి రోజు ఒక కప్పు జామకాయ ముక్కలు తినొచ్చు..

అరటిపండు

ఏడాది పొడవునా దొరికే అరటి పండు తీసుకుంటే శరీరానికి కావాల్సిన శక్తి, సహజ చక్కెరలు శరీరానికి వెంటనే అందుతాయి. అరటిపండులో పీచు పదార్థాలు ఎక్కువ. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ బి6, మాంగనీస్, పొటాషియం వ్యాధినిరోధకతను పెంచుతాయి. రక్తపోటును తగ్గించే పొటాషియం కూడా అరటిపండుతో లభిస్తుంది. జీర్ణశక్తిని కూడా పెంచుతుంది. 

దానిమ్మ

దానిమ్మ మెదడులో వాపును తగ్గించడంతోపాటు అల్జీమర్స్ ని తగ్గిస్తుంది దానిమ్మ,విటమిన్-సి, కెలతో పాటు ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ రక్తాన్ని శుభ్రపరుస్తాయి. దానిమ్మపండు మధుమేహగ్రస్తులకు కూడా చాలా మంచిది. రక్తంలో చక్కెర స్థాయిను క్రమబద్ధీకరిస్తుంది.