నాకు మంచి పేరు రావడం.. కేసీఆర్ జీర్ణించుకోలేకపోయాడు

నాకు మంచి పేరు రావడం.. కేసీఆర్  జీర్ణించుకోలేకపోయాడు

సీఎం కేసీఆర్ కుట్ర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు ఈటల రాజేందర్. ఆరోరోజు ప్రజాదీవెన పాదయాత్రలో భాగంగా ఇల్లందకుంటలో ఈటల మాట్లాడారు. హుజురాబాద్ నియోజవర్గ ప్రజలు తనను కడుపులో పెట్టుకోని చూసుకున్నారని తెలిపారు.  ఆరుసార్లు ధర్మంగా గెలిచనని తెలిపారు. కరోనాటైంలో ముందుండి వైద్యారోగ్యశాఖను నడిపించిన తనపై కుట్రపన్ని పదవినుంచి తొలగించారన్నారు.తాను కరోనా సమయంలో  పనిలో ఉంటే.. కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చుని తనకు పేరు రావడం జీర్ణించుకోలేకపోయాడన్నారు. ఆరోగ్య మంత్రిగా, ఆర్థిక మంత్రిగా తనకు మంచి పేరొస్తోందని కుట్ర పన్ని పథకం రచించాడని..అందుకే కొంతమందికి డబ్బులిచ్చి దరఖాస్తు తీసుకుని మంత్రి వర్గం నుంచి తీసేశారన్నారు. 

తాను కేసీఆర్ బొమ్మతో గెలిచానని టీఆర్ఎస్ నేతలు అంటున్నారని..మరి కేసీఆర్ తన బిడ్డను ఎందుకు గెలిపించుకోలేకపోయారని  ప్రశ్నించారు. తెలంగాణ భవన్ లో లేచినోడు, లేవనోడు.. తన మీద అవాకులు, చెవాకులు మాట్లాడారన్నారు. సొంతపార్టీ నాయకులనే అంగట్లో పశువుల్లాగా డబ్బు సంచులు పెట్టి కొనుగోలు చేసారన్నారు. తనతో పాటు మిగిలివాళ్లే నిఖార్సైన బిడ్డలన్నారు ఈటల.