అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతోన్న చిత్రం ‘డెకాయిట్’. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్నారు. సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గురువారం టీజర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా అడివి శేష్ మాట్లాడుతూ ‘ఈ సినిమా విషయంలో మేము చాలా ప్రౌడ్‌గా ఉన్నాం.
ఇది చాలా బిగ్ ఫిలిం. తెలుగు, హిందీ భాషల్లో తీశాం. ఒక తెలుగోడు, ఒక హిందీ వాడు కలిసి చేసిన సినిమా. నేను షానియల్ కలిసి రాశాం. తను నా బెస్ట్ ఫ్రెండ్. మేమిద్దరం యూఎస్‌లో పెరిగాం. తను మన కల్చర్ అర్థం చేసుకొని, నేను తన కల్చర్ అర్థం చేసుకుని ఒక హైబ్రిడ్ సినిమా చేశాం. తను టెక్నికల్‌గా అమెరికన్ స్టైల్‌లో తీశాడు. అనురాగ్ సార్ లాంటి వరల్డ్ క్లాస్ ఫిల్మ్‌మేకర్‌తో పనిచేయడం మంచి ఎక్స్‌పీరియెన్స్. ఆయన మాకు ఎంతో గైడెన్స్ ఇచ్చారు’ అని చెప్పాడు. తన మనసుకు చాలా దగ్గరైన సినిమా ఇదని, దీనికోసం హార్ట్ అండ్ సోల్ పెట్టానని మృణాల్ ఠాకూర్ చెప్పింది. ఈ సినిమా చేయడం చాలా ఫన్ ఎక్స్‌పీరియెన్స్ అని, ఇందులో ఉన్న యాక్షన్ ఇంపాజిబుల్ అని అనురాగ్ కశ్యప్ అన్నాడు. ఈ చిత్రం తనకొక గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్ అని డైరెక్టర్ షానియల్ డియో అన్నాడు. ఈ చిత్రాన్ని మార్చి 19న విడుదల చేయనున్నట్టు, విజయంపై నమ్మకంగా ఉన్నామని నిర్మాత సుప్రియ యార్లగడ్డ తెలియజేశారు.
