ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్ చేసే బ్యాడ్‌‌‌‌ గాళ్స్

ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్ చేసే బ్యాడ్‌‌‌‌ గాళ్స్


‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ ఫేమ్  ఫణి ప్రదీప్ ధూళిపూడి  రూపొందించిన చిత్రం ‘బ్యాడ్‌‌‌‌ గాళ్స్‌‌‌‌’.  కానీ చాలా మంచోళ్లు అనేది ట్యాగ్‌‌‌‌లైన్.  అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ లీడ్ రోల్స్‌‌‌‌లో  నటించారు.  రేణూ దేశాయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. 

 శశిధర్ నల్లా, ఎమ్మాడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ నిర్మించారు.  క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న సినిమా విడుదల కానుంది. గురువారం ఈ మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌ను దర్శకుడు బుచ్చిబాబు సానా రిలీజ్ చేసి టీమ్‌‌‌‌కు బెస్ట్ విషెస్ చెప్పాడు. ఈ సందర్భంగా డైరెక్టర్ ఫణి ప్రదీప్ మాట్లాడుతూ ‘ఇదొక కంప్లీట్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్.  అమ్మాయిలు లీడ్ రోల్స్‌‌‌‌లో జాతి రత్నాలు, మ్యాడ్ లాంటి హిలేరియస్ సినిమాలు చేస్తే ఎలా ఉంటుందో అలాంటి చిత్రమే ఇది. చాలా కొత్తగా ఫ్రెష్ ఫీల్ ఇచ్చేలా ఉంటుంది. అనూప్ రూబెన్స్ సంగీతం, చంద్రబోస్ గారి లిరిక్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి’ అని అన్నాడు.