ఎన్నికల విధుల్లో 90 వేల మంది ఉద్యోగులు పాల్గొంటారని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. మే 13న వేతనంతో కూడిన సెలవు ప్రకటిస్తున్నామని చెప్పారు. నింబంధనలు పాటించని సంస్థలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు వికాస్ రాజ్. సాయంత్రం 5 గంటల తరువాత నియోజకవర్గాల్లో నాన్ లోకల్స్ వాళ్లు ఉండొద్దని చెప్పారు వికాస్ రాజ్ . రేపు, ఎల్లుండి మీడియాలో ప్రకటనలో ఇవ్వాలంటే పర్మిషన్ తప్పనిసరి చెప్పారు. ఈ రెండు రోజులు నిఘూ మరింత ఉంటుందని వెల్లడించారు. బందోబస్తు కోసం రాష్ట్రానికి 160 కేంద్ర బలగాలు వచ్చాయని తెలిపారు. 60 వేల మంది రాష్ట్ర పోలీసులు విధుల్లో ఉన్నారన్నారు. 87 వేలకుపైగా బ్యాలెట్ యూనిట్లను వినియోగిస్తున్నామన్నారు వికాస్ రాజ్. తనిఖిల్లో ఇప్పటివరకు 320 కోట్లు సీజ్ చేశామని వెల్లడించారు.
