బతుకమ్మను తలిస్తుండగా కరెంట్ షాక్.. నలుగురికి గాయాలు

బతుకమ్మను తలిస్తుండగా కరెంట్ షాక్.. నలుగురికి గాయాలు

కూకట్​పల్లి, వెలుగు: కూకట్​పల్లిలో భారీ బతుకమ్మను ఆటోలో తరలిస్తుండగా హైటెన్షన్ వైర్లు తగిలి నలుగురు గాయప్డడారు. వివేకానందనగర్​డివిజన్​పరిధిలోని పాపారాయుడు నగర్​ దేవిస్తాన్​ విల్లాస్‎లో బతుకమ్మను భారీగా పేర్చారు. సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఈ బతుకమ్మను విల్లాస్​నుంచి కూకట్​పల్లి వైపు ట్రాలీ ఆటోలో తీసుకెళ్తుండగా, బతుకమ్మ చుట్టూ అమర్చిన ఐరన్​రాడ్స్​హైటెన్షన్​వైర్లకు తగిలాయి. దీంతో ఆటోలో ఉన్న స్థానికులు జాన్​పాషా(40), కాశయ్య(40)తో పాటు మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. వీరంతా ఓ ప్రైవేటు హాస్పిటల్లో ఔట్​పేషెంట్స్‎గా ట్రీట్మెంట్ తీసుకొని వెళ్లిపోయారు. ఈ ఘటనపై కూకట్​పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.