సెల్ బిల్లు తరహాలో.. ఎక్స్ (ట్విట్టర్) ఛార్జీలు.. మస్క్ న్యూ ప్లాన్

సెల్ బిల్లు తరహాలో.. ఎక్స్ (ట్విట్టర్) ఛార్జీలు.. మస్క్ న్యూ ప్లాన్

ట్విట్టర్ను కొనుగోలు చేసిన తర్వాత ఎలన్ మస్క్ విచిత్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. మొదట్లో బ్లూ టిక్ ఆప్షన్ను తీసేసిన మస్క్..ఆ తర్వాత బ్లూ టిక్ పొందాలంటే సబ్ స్క్రిప్షన్ చేసుకోవాల్సిందేనని చెప్పాడు.  అనంతరం ఏకంగా ట్విట్టర్ పేరు, లోగోనే మార్చేశాడు. ఇప్పుడు ట్విట్టర్ (X) యూజర్లకు షాకిచ్చే నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పాడు.  అదేంటంటే..
 
ఎక్స్ (ట్విట్టర్) ను ఉపయోగించే యూజర్లు ఇకపై ఛార్జీలు చెల్లించాలని ఎలన్ మస్క్ వెల్లడించాడు. ఎవరికైతే ఎక్స్ ఖాతా ఉందో..వారందరూ తప్పనసరిగా ఛార్జీలు చెల్లించాలన్నాడు. అయితే ఈ ఛార్జీలు నెలవారీగా వసూలు చేయనున్నట్లు స్పష్టం చేశాడు. అయితే ఈ కొత్త నిర్ణయం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందో మాత్రం చెప్పలేదు. 

ALSO READ: ఖలిస్తాన్ టెర్రరిస్టు హత్య.. కెనడా వాదనలను తిప్పికొట్టిన భారత్

ఎక్స్ (X)యూజర్ల నుంచి ఛార్జీలు వసూలు చేయనున్న విషయాన్ని  ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో సమావేశమైన సందర్భంలో మస్క్ వెల్లడించాడు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 550 మిలియన్ల మంది ఎక్స్ (X) యూజర్లు ఉన్నారని..వారిలో ప్రతీ రోజూ 100 నుంచి 200 మిలియన్ల మంది ఎక్స్ ను ఉపయోగిస్తున్నారని తెలిపారు. అయితే ఇందులో ఎంత మంది నిజమైన యూజర్లో..ఎంత మంది ఫేక్ యూజర్లో తెలియడం లేదన్నాడు. ఎక్స్ యూజర్లలో చాలా మంది విద్వేష పూరిత ప్రసంగాలు, మతానికి సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్స్ (X) ఉపయోగించే వారికి నెలవారీ ఛార్జీలను వసూలు చేసే దిశగా ఆలోచన చేస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో వెల్లడించాడు.