- కంపెనీ లక్ష్యాలు నెరవేరితే 900 బిలియన్ డాలర్లకు పెరగనున్న టెస్లా చీఫ్ సంపద
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో ఉన్న టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ త్వరలో మరో రికార్డు సృష్టించబోతున్నారు. ప్రపంచంలోనే ఫస్ట్ ట్రిలియనీర్ గా అవతరించనున్నారు. ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా తాtను అనుకున్న లక్ష్యాలను చేరుకుంటే, ప్రోత్సాహక ప్యాకేజీ కింద మస్క్ కు భారీ మొత్తంలో డబ్బు సమకూరుతుంది. దీంతో ఆయన సంపద బాగా పెరిగి ప్రపంచంలోనే ఫస్ట్ ట్రిలియనీర్ గా మస్క్ చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయన సంపద విలువ దాదాపు 400 బిలియన్ డాలర్లు (రూ.35 లక్షల కోట్లు).
వచ్చే రోజుల్లో తమ సంస్థ మార్కెట్ విలువను భారీగా పెంచేందుకు టెస్లా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు 1.1 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న కంపెనీ మార్కెట్ విలువను వచ్చే పదేండ్లలో గణనీయంగా పెంచాలని కంపెనీ ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో రోబోట్యాక్సీ, ఏఐ మార్కెట్ విస్తరణ వంటి లక్ష్యాలను నిర్దేశించుకుంది. ఈ లక్ష్యాలను సాధిస్తే, ప్రతిపాదించిన ప్రోత్సాహక ప్యాకేజీ కింద మస్క్ కు భారీగా షేర్లు సమకూరుతాయి. దాదాపు 900 బిలియన్ డాలర్లు (రూ.79 లక్షల కోట్లు) ఆయనకు సమకూరతాయని అంచనా. దీంతో ప్రపంచంలోనే ఫస్ట్ ట్రిలియనీర్ గా మస్క్ రికార్డు నెలకొల్పే అవకాశం ఉంది.
