ఇంగ్లండ్‌, కివీస్‌ ఫస్ట్‌ టెస్ట్‌ డ్రా

ఇంగ్లండ్‌, కివీస్‌ ఫస్ట్‌ టెస్ట్‌ డ్రా

లండన్‌‌: ఇంగ్లండ్‌‌, న్యూజిలాండ్‌‌ మధ్య గుతున్న ఫస్ట్‌‌ టెస్ట్‌‌ డ్రా అయ్యింది. కివీస్‌‌ నిర్దేశించిన 273 రన్స్‌‌ టార్గెట్‌‌ ఛేదించేందుకు ఆదివారం బరిలోకి దిగిన ఇంగ్లిష్‌‌ టీమ్‌‌ రెండో ఇన్నింగ్స్‌‌లో 70 ఓవర్లలో 3 వికెట్లకు 170  రన్స్‌‌ చేసింది. డామ్‌‌ సిబ్లే (60 బ్యాటింగ్‌‌), ఒలీ పోప్‌‌ (20 బ్యాటింగ్‌‌) రాణించారు. రోరీ బర్న్స్‌‌ (25), జాక్‌‌ క్రాలీ (2) విఫలమైనా.. రూట్‌‌ (40) ఓ మాదిరిగా ఆడాడు. అంతకుముందు 62/2 ఓవర్‌‌నైట్‌‌ స్కోరుతో లాస్ట్‌‌ డే ఆట కొనసాగించిన న్యూజిలాండ్‌‌ సెకండ్‌‌ ఇన్నింగ్స్‌‌ను 169/6 వద్ద డిక్లేర్‌‌ చేసింది. టామ్‌‌ లాథమ్‌‌ (36), నీల్‌‌ వాగ్నర్‌‌ (10) విఫలమయ్యారు. చివర్లో రాస్‌‌ టేలర్‌‌ (33), నికోల్స్‌‌ (23), వాట్లింగ్‌‌ (15 నాటౌట్‌‌) ఫర్వాలేదనిపించినా.. ఇంగ్లండ్‌‌ ముందు స్వల్ప టార్గెట్‌‌ను ఉంచి విలియమ్సన్‌‌ సాహసం చేశాడు. కివీస్‌‌ బౌలర్లలో రాబిన్‌‌సన్‌‌ 3 వికెట్లు తీశాడు.