ఎరుకల  నాంచారమ్మ జాతర షురూ

ఎరుకల  నాంచారమ్మ జాతర షురూ

వెంకటాపూర్( రామప్ప) వెలుగు : ములుగు జిల్లా వెంకటాపూర్​ మండలం రామాంజాపూర్​ ఎరుకల నాంచారమ్మ జాతర ప్రారంభమయ్యింది. సోమవారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు ఎమ్మెల్యేకు ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అమ్మవారి ఆశీర్వాదంతో గెలుపొందానని ఆలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని అన్నారు. 

ఎమ్మెల్సీ కవిత అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని పూజలు చేశారు. ఆలయాభివృద్ధికి సహకరిస్తానని హామీ ఇచ్చారు. భక్తులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం  కవిత రామప్ప టెంపుల్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎరుకల సంఘం భూపాలపల్లి నాయకుడు కేతిరి సుభాష్​, ములుగు జిల్లా అధ్యక్షుడు కేతిరి భిక్షపతి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.