రామాయంపేట మాజీ ఎమ్మెల్యే ఆర్ఎస్ వాసు రెడ్డి కన్నుమూత

రామాయంపేట మాజీ ఎమ్మెల్యే ఆర్ఎస్ వాసు రెడ్డి కన్నుమూత

రామాయంపేట మాజీ ఎమ్మెల్యే ఆర్ఎస్ వాసు రెడ్డి కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. చేగుంట మండలం పోలంపల్లి గ్రామంలో తన స్వగృహంలో వాసురెడ్డి కన్నుమూశారు. 1984-89 ఎన్నికల్లో రామాయంపేట నియోజకవర్గం నుంచి  బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి వాసురెడ్డి గెలిచారు. వాసురెడ్డి మృతిపట్ల బీజేపీ నాయకులు సంతాపం తెలుపుతన్నారు. బీజేపీకి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటున్నారు.  పొలంపల్లి గ్రామంలో వాసురెడ్డి అంత్యక్రియలు రేపు జరగనున్నాయి.