క్రాప్​ లోన్​ ఉందని.. రైతుబంధు ఇయ్యలేదని రైతు సూసైడ్

క్రాప్​ లోన్​ ఉందని.. రైతుబంధు ఇయ్యలేదని  రైతు సూసైడ్

క్రాప్​ లోన్ ​పెండింగ్​ ఉందని బ్యాంకు అధికారులు రైతుబంధు పైసలు ఇవ్వకపోవడంతో ఓ రైతు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు.  ఆసిఫాబాద్ జిల్లా దేవాపూర్​కు చెందిన జాదవ్ రోహిదాస్(40) కు రైతుబంధు కింద రూ.15 వేలు అకౌంట్​లో పడ్డాయి. ఆ పైసల కోసం బ్యాంకుకు వెళ్లగా రూ. 62 వేల క్రాప్ లోన్ ఉందని, అకౌంట్​ను​ హోల్డ్​లో పెట్టామని అధికారులు చెప్పారు. దీంతో రోహిదాస్​ ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆసిఫాబాద్, వెలుగు: క్రాప్​ లోన్ ​ఉందని రైతుబంధు పైసలు ఇవ్వకపోవడంతో ఓ రైతు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలో జరిగింది. కెరమెరి మండలం దేవాపూర్ కు చెందిన జాదవ్ రోహిదాస్ (40) కు 3 ఎకరాలు ఉండగా, పత్తి సాగు చేస్తున్నాడు. ఇటీవలే రైతుబంధు కింద రూ.15 వేలు అకౌంట్​లో పడ్డాయి. ఆ పైసలు తెస్తే పెట్టుబడులకు పని కొస్తాయని ఆశపడ్డాడు. డ్రా చేసేందుకు ఈనెల 22న కెరమెరిలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకుకు వెళ్లాడు. బ్యాంకులో రోహిదాస్​ పేరు మీద రూ. 62 వేల క్రాప్ లోన్ ఉంది. దాన్ని ప్రభుత్వం మాఫీ చేయకపోవడంతో రోహిదాస్ ​ఖాతాను ​హోల్డ్​లో పెట్టారు. వడ్డీ కట్టి ​లోన్​ రెన్యువల్​ చేసుకుంటే రైతుబంధు పైసలు డ్రా చేసుకోవచ్చని బ్యాంకోళ్లు చెప్పారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురై బుధవారం గడ్డి మందు తాగాడు. కుటుంబసభ్యులు ఆదిలాబాద్ రిమ్స్ కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ గురువారం చనిపోయాడు.