హనుమకొండ జిల్లా: పెరుమాండ్ల గూడెంలో ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ను అడ్డుకున్నారు రైతులు. ల్యాండ్ పూలింగ్ ను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దళితబంధు అందరికీ ఇస్తేనే ఊర్లోకి రావాలన్నారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులకు, గ్రామస్తులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో.. పర్యటన అర్థాంతరంగా ముగించుకుని వెళ్లిపోయారు ఆరూరి.
