సీసీఐ నిబంధనలతో రైతులు ఇబ్బంది పడుతున్నారు : కోదండరెడ్డి

సీసీఐ నిబంధనలతో రైతులు ఇబ్బంది పడుతున్నారు : కోదండరెడ్డి
  • సమస్యను పరిష్కరించాలని గవర్నర్‌‌‌‌కు రైతు కమిషన్ వినతి

హైదరాబాద్, వెలుగు: సీసీఐ కొత్త నిబంధనలతో రాష్ట్రంలోని పత్తి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు రాష్ట్ర రైతు కమిషన్ తెలిపింది.  సోమవారం రాజ్‌‌‌‌భవన్‌‌‌‌లో కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి నేతృత్వంలోని బృందం గవర్నర్‌‌‌‌ను కలిసింది.

రైతు సమస్యలను పరిష్కరించాలంటూ వినతిపత్రం అందజేసింది.  సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభించడం, ‘కపాస్ కిసాన్’ యాప్‌‌‌‌లో తప్పనిసరి రిజిస్ట్రేషన్, ఎకరాకు 7 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు పరిమితి వంటి నియమాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.