ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా రిజర్వేషన్ల ఖరారు.. గ్రామాల్లో ఎన్నికల సందడి

ఉమ్మడి  కరీంనగర్ జిల్లావ్యాప్తంగా రిజర్వేషన్ల ఖరారు.. గ్రామాల్లో ఎన్నికల సందడి
  • సగం సర్పంచ్ స్థానాలు మహిళలకు కేటాయింపు
  • ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బీసీలకు 307, ఎస్సీలకు 251, ఎస్టీలకు 64 స్థానాలు కేటాయింపు
  • ఇస్తే ప్రధాన పార్టీ మద్ధతుతో.. లేదంటే ఇండిపెండెంట్లుగా బరిలోకి..
  • గ్రామాల్లో లీడర్ల  హుషారు.. పోటీకి రెడీ అవుతున్న ఆశావహులు

కరీంనగర్/జగిత్యాల/రాజన్నసిరిసిల్ల/పెద్దపల్లి వెలుగు:  గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఉమ్మడి  కరీంనగర్ జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో సర్పంచ్ స్థానాలతోపాటు వార్డులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. రొటేషన్ విధానం ద్వారా రిజర్వేషన్లు కేటాయించారు. బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు.

 కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో కలిపి మొత్తం 1,226 గ్రామపంచాయతీలు ఉండగా.. ఇందులో 604 సర్పంచ్ స్థానాలు అన్ రిజర్వుడ్/జనరల్‌‌‌‌ కేటగిరీకి కేటాయించారు. బీసీలకు 307 స్థానాలు, ఎస్సీలకు 251 స్థానాలు, ఎస్టీలకు 64 స్థానాలు దక్కాయి.  కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రాయికల్ తండా ఒక్కటే ఎస్టీ జనరల్‌‌‌‌కు రిజర్వు అయింది. 

పోటీకి రెడీ అవుతున్న ఆశావహులు

గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు కావడంతో పల్లెల్లో ఒక్కసారిగా సందడి మొదలైంది. కొందరికి రిజర్వేషన్ కలిసిరాగా.. మరికొందరికి ఇబ్బందికరంగా మారింది. రిజర్వేషన్ కలిసిరానివాళ్లు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై ఆశలు పెట్టుకున్నారు. ఆశావహులు సర్పంచులుగా తమ అదృష్టం పరీక్షించుకునేందుకు గ్రామంలోని ముఖ్యమైన లీడర్ల మద్దతుతోపాటు అన్ని రకాల వనరులను సిద్ధం చేసుకుంటున్నారు. 

సర్పంచ్ ఎన్నికలు పార్టీ సింబల్ పై జరగనప్పటికీ పార్టీలు బలపరిచిన అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ ఉంటుంది. అందుకే కాంగ్రెస్, బీఆర్ఎస్ తోపాటు కొన్ని గ్రామాల్లో బీజేపీ మద్దతు కోసం ఆశావహులు పైరవీలు మొదలుపెట్టారు. ఏ పార్టీ నుంచి మద్దతు లేకపోతే ఇండిపెండెంట్ గానైనా బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు. మరికొందరు వార్డు సభ్యులుగా గెలిచి ఉపసర్పంచులుగా అవకాశం దక్కించుకోవాలని చూస్తున్నారు.    

కరీంనగర్

పంచాయతీల సంఖ్య    318 

వంద శాతం గిరిజన గ్రామాల సంఖ్య:    లేవు  నాన్ షెడ్యూల్ ఏరియా 

ఎస్టీ మహిళ                    0
ఎస్టీ జనరల్                    1 
ఎస్సీ మహిళ                 33
ఎస్సీ జనరల్                38
బీసీ మహిళ                   40
బీసీ జనరల్                 44
అన్ రిజర్డ్వ్ మహిళ    74
అన్ రిజర్డ్వ్ జనరల్    88

రాజన్న సిరిసిల్ల 

పంచాయతీల సంఖ్య    260 

వంద శాతం గిరిజన గ్రామాల సంఖ్య     26

ఎస్టీ మహిళ    11
ఎస్టీ జనరల్    15

నాన్ షెడ్యూల్ ఏరియా 

ఎస్టీ మహిళ           2
ఎస్టీ జనరల్          2
ఎస్సీ మహిళ         24
ఎస్సీ జనరల్        29
బీసీ మహిళ           24
బీసీ జనరల్          32
జనరల్​మహిళ      58
జనరల్                  63

జగిత్యాల

పంచాయతీల సంఖ్య    385

100 శాతం గిరిజన  గ్రామాల సంఖ్య:     22

ఎస్టీ మహిళ             10
ఎస్టీ జనరల్            12

నాన్ షెడ్యూల్ ఏరియా

ఎస్టీ మహిళ                00
ఎస్టీ జనరల్                05
ఎస్సీ మహిళ               31
ఎస్సీ జనరల్              41
బీసీ మహిళ                 44
బీసీ జనరల్                54
అన్ రిజర్డ్వ్ మహిళ     89
అన్ రిజర్డ్వ్ జనరల్    99

పెద్దపల్లి

పంచాయతీల సంఖ్య    263

వంద శాతం గిరిజన  గ్రామాల సంఖ్య :     లేవు నాన్ షెడ్యూల్ ఏరియా 

ఎస్టీ మహిళ                            3
ఎస్టీ జనరల్                          3
ఎస్సీ మహిళ                       22
ఎస్సీ జనరల్                      33
బీసీ మహిళ                         31
బీసీ జనరల్                        38 
అన్ రిజర్డ్వ్ మహిళ            64
అన్ రిజర్డ్వ్ జనరల్           69