పంట కొని తొమ్మిది నెలలైనా డబ్బులియ్యట్లే..

పంట కొని తొమ్మిది నెలలైనా డబ్బులియ్యట్లే..
  • న్యూజివీడు విత్తనాల కంపెనీ ఎదుట రైతుల ఆందోళన

జీడిమెట్ల, వెలుగు: పంట కొనుగోలు చేసి తొమ్మి ది నెలలు గడుస్తున్నా తమకు డబ్బులు ఇవ్వట్లేదని రైతులు ఆందోళనకు దిగారు. గురువారం దూలపల్లిలోని న్యూజివీడు సీడ్స్​ కంపెనీ ఎదుట మెదక్​ జిల్లా చిన్న శంకరంపేట్​ మండలం గోరిల్లా తండాకు చెందిన రైతులు టెంట్​ వేసుకుని ఆందోళన చేశారు. 

వారు మాట్లాడుతూ.. న్యూజివీడు సీడ్స్​ కంపెనీ 150 మంది రైతుల నుంచి రూ.కోటి 50 లక్షల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసిందన్నారు. 9 నెలలుగా గడుస్తున్నా పేమెంట్లు మాత్రం చేయడం లేదన్నారు. తాము ఇప్పుడు పంటలు సాగుచేయాలంటే పెట్టుబడి లేక ఇబ్బంది పడుతున్నామన్నారు. యాజమాన్యం ఆర్గనైజర్​ సత్యనారాయణ వారితో చర్చలు జరిపి త్వరలో చెల్లిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.