
వేములవాడ, వెలుగు : వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ హుండీ ఆదాయం రూ. 1. 21 కోట్లు వచ్చినట్టు ఈవో ఎల్.రమాదేవి గురువారం తెలిపారు. 29 రోజుల హుండీ ఆదాయాన్ని ఈవో పర్యవేక్షణలో, ఎస్పీఎఫ్ సిబ్బంది బందోబస్తు మధ్య ఆలయ సిబ్బంది లెక్కించారు. స్వామివారి ఖజానాకు రూ.1 కోటి 21 లక్షల 70 వేల 150 నగదు, 64 గ్రాముల 900 గ్రాముల బంగారం, 7 కిలోల 300 గ్రాముల వెండిని భక్తులు కానుకలుగా సమర్పించినట్టు అధికారులు తెలిపారు.