తెలంగాణ బొగ్గు బ్లాక్లను సింగరేణికే కేటాయించాలి : వెంకన్నజాదవ్

తెలంగాణ బొగ్గు బ్లాక్లను సింగరేణికే కేటాయించాలి :  వెంకన్నజాదవ్
  •     కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకన్నజాదవ్

 కోల్​బెల్ట్​,వెలుగు : తెలంగాణలోని బొగ్గు బ్లాక్​లను సింగరేణి సంస్థకే కేటాయించాలని కంపెనీ ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్, సీవీవో బి.వెంకన్న జాదవ్​ కోరారు. గురువారం న్యూఢిల్లీలో  బొగ్గు గనుల మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు.  దేశవ్యాప్తంగా త్వరలో పలు బొగ్గు బ్లాక్​లను వేలం వేసేందుకు  కేంద్ర బొగ్గు గనుల శాఖ నిర్ణయించినందున కీలక మీటింగ్ నిర్వహించింది.  

బొగ్గు బ్లాక్​ల ఈ– ఆక్షన్​పైనే ప్రధానంగా  చర్చించారు.  తెలంగాణ బొగ్గు బ్లాకులను సింగరేణికే  కేటాయిస్తే  రాష్ట్రంలోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు కావలసిన బొగ్గు సరఫరా అవుతుందని,  బొగ్గు గనుల మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి  సనోజ్ కుమార్ ఝా, జాయింట్ సెక్రటరీ సంజీవ్ కుమార్ కాస్సి, డైరెక్టర్  అజితేశ్ కుమార్ ను కోరారు.