
పరిగి, వెలుగు: తమను పరిగి ఆర్టీసీ డిపో మేనేజర్ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ ప్రైవేట్ఆర్టీసీ డ్రైవర్లు నిరసనకు దిగారు. బుధవారం ఉదయం విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీటింగ్కెపాసిటీకి మించి ప్రయాణికులను బస్సులో ఎక్కించుకోవాలని డిపో మేనేజర్ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు.
ఈ విషయంపై డిపో మేనేజర్ సుఖేందర్‌రెడ్డి స్పందిస్తూ.. ఓ డ్రైవర్బస్సు ఆపకుండా వెళ్లాడని ఓ మహిళ ఫిర్యాదు చేశారని, ఆమె ఫిర్యాదుతో సదరు డ్రైవర్‌కు ఒకరోజు విధులు ఇవ్వలేదని చెప్పారు. అంతేగానీ తాను డ్రైవర్లను ఇబ్బంది పెడుతున్నామనడంలో వాస్తవం లేదన్నారు. ప్రైవేట్డ్రైవర్ల విధుల బహిష్కరణతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.